మా జీవితాలను మీరు పోర్న్ చిత్రాలుగా ఎలా చూపిస్తారు..?

Thousands of South Korean women protest against 'spy cam porn'
Highlights

తమ వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని.. తమ జీవితాన్ని పోర్న్ చిత్రాలుగా ఏలా మారుస్తారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.

షాపింగ్ మాల్స్ లో అమ్మాయిలు దుస్తులు మార్చుకునే గదిలో సీసీకెమేరాలు పెట్టడం గురించి మీరు వినే ఉంటారు. కేవలం అక్కడే కాదు.. మహిళలకు తెలియకుండా వారు తిరిగే పలు ప్రదేశాల్లో ఈ సీసీ కెమేరాలను ఏర్పాటు చేసి.. వాటిని పోర్న్ చిత్రాలుగా మలుస్తున్నారు. కాగా.. దీనిపై దక్షిణ కొరియాలోని మహిళలు ఉద్యమం చేపట్టారు.

 సీక్రెట్‌ కెమెరాలతో రికార్డ్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది మహిళలు ’ నా జీవితం నీ అశ్లీల చిత్రం కాదు’ అనే ప్లకార్డులు చేపట్టి ఇటీవల దక్షిణ కొరియాలో నిరసన తెలిపారు. తమ వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని.. తమ జీవితాన్ని పోర్న్ చిత్రాలుగా ఏలా మారుస్తారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 ఇలాంటి వీడియోలు రికార్డ్‌ చేస్తున్న, వీక్షిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. దక్షిణ కొరియాలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా ‘మీ టూ ఉద్యమం’ సాగుతోంది. దీని ద్వారా మహిళలపై లైంగికదాడులు, వేధింపులకు పాల్పడిన అధికార డెమొక్రాటిక్‌ పార్టీ  నేత యాన్‌ హి–జింగ్‌తో సహా పలువురు ప్రముఖులను సైతం ఎండగట్టగలిగారు. ఈ నేపథ్యంలోనే తమను రహస్య కెమెరాల్లో చిత్రీకరించడంపైనా మహిళలు గళమెత్తుతున్నారు. 

పార్కులు, స్విమ్మింగ్‌పూల్‌లు, బీచుల్లోని  రెస్ట్‌రూమ్‌లు, గదుల్లో దుస్తులు మార్చుకుంటున్న మహిళలను రహస్య కెమెరాల ద్వారా రికార్డ్‌  చేయడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. వీటిపై మహిళల నుంచి ఒక్కసారిగా ఫిర్యాదులు పెరిగిపోవడంతో పోలీస బృందాలు స్కానర్లతో రంగంలోకి దిగి బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ  సీక్రెట్‌ కెమెరాలు ఉన్నాయన్న దానిని కనిపెట్టే చర్యలు చేపడుతున్నారు.

loader