మీరు విమానంలో ప్రయాణం చేస్తున్నారు అనుకోెండి.. మీతో పాటు విమానంలో ఉన్న అందరూ నిద్రపోతున్న సమయంలో మీ సీటు పైన కాళ్లు పెడుతూ, మీ మీదుగా ఎవరైనా దూకితే ఎలా ఉంటుంది ? చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. ఓ మహిళా ప్రయాణికురాలి వల్ల విమానంలో కొందరికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఓ మ‌హిళ విమానంలో విండో సీటు కోసం ఓ వింత ప‌నికి పూనుకుంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విట్ల‌ర్ లో వైర‌ల్ గా మారింది. త‌న సీటు నుంచి విండో ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డానికి ఇత‌ర ప్రయాణికుల‌పై నుంచి దూకుతూ వెళ్లింది. ఆమె చేసిన మొర‌టు, వికృత ప‌నిని బ్రాండన్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ఈ క్లిప్ నెటిజ‌న్ల‌ను అయోమయానికి గురి చేసింది. దీనిపై చర్చ ప్రారంభమైంది. 

Scroll to load tweet…

బ్రాండన్ షేర్ చేసిన వీడియోను ప‌రిశీలిస్తే.. స‌ద‌రు మ‌హిళా ప్ర‌యాణికురాలు ఇత‌రుల సీట్ల‌పై కాలు పెడుతూ మ‌రో దిక్కు వెళ్తోంది. ఆ సీట్లలో చిన్న పిల్లవాడు, మ‌రో ప్ర‌యాణికుడి కూడా ఉన్నా.. వారెవ‌ర‌నీ ప‌ట్టించుకోకుండా సీట్ల పైనుంచి దూకి వెళ్లింది.

Scroll to load tweet…

దీనిని వీడియో తీసిన బ్రాండ‌న్ షేర్ చేస్తూ ‘‘ నేను విమానంలో చూసిన అత్యంత క్రిమినల్ యాక్టివిటీ ఇది. ఈ మహిళ మొత్తం 7 గంటల విమానంలో ఇలా ఇత‌ర ప్రయాణీకులపైకి దూసుకెళ్లింది ’’ అని క్యాప్షన్ ఇచ్చారు. 

Scroll to load tweet…

ఈ క్లిప్ ను ఆరు వేల మంది నెటిజ‌న్లు వీక్షించారు. ఆ మ‌హిళ అసభ్యకరమైన ప్రవర్తనను చూసి షాక్ అయ్యారు. పిల్లలతో వెళ్తున్న ఓ ప్రయాణికుడిని ఇబ్బంది పెట్టినందుకు ఆమెపై తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆమె వికృత ప్ర‌వ‌క్త‌ను ఎత్తి చూపారు. ఆమెతో గొడ‌వ ప‌డ్డారు.

Scroll to load tweet…

అయితే ఆమె ప‌క్క సీటులో కూర్చున్న ప్ర‌యాణికులు బాత్ రూమ్ కు వెళ్లిప్పుడు, కాలు సాగ‌దీసేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్పుడు మొర‌టుగా వ్యాఖ్యలు చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.