Asianet News TeluguAsianet News Telugu

విద్యార్ధిని నగ్న ఫోటోలు, వీడియోలు ఫేస్‌బుక్‌లో పోస్టు: పరిహరం చెల్లించనున్న ఐ ఫోన్ కంపెనీ

ఓ విద్యార్ధిని నగ్న ఫోటోలు, వీడియోలు ఫేస్‌బుక్‌లో పోస్టు కావడంతో ఐ ఫోన్ సంస్థ బాధితురాలికి పరిహారం చెల్లించాల్సి వస్తోంది.
 

Students nude photos leaked to Facebook by iPhone service centre lns
Author
Washington D.C., First Published Jun 7, 2021, 7:31 PM IST

వాషింగ్టన్: ఓ విద్యార్ధిని నగ్న ఫోటోలు, వీడియోలు ఫేస్‌బుక్‌లో పోస్టు కావడంతో ఐ ఫోన్ సంస్థ బాధితురాలికి పరిహారం చెల్లించాల్సి వస్తోంది.అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఒరెగాన్ కు చెందిన ఓ విశ్వవిద్యాలయ విద్యార్ధిని తన ఫోన్ రిపేర్ కు రావడంతో పెగాట్రాన్ సంస్థ నిర్వహిస్తున్న సర్వీస్ సెంటర్ లో తన ఫోన్ ఇచ్చింది. ఈ ఫోన్‌లోని నగ్న ఫోటోలు, వీడియోలు ఆమె ఫేస్‌బుక్‌లో కన్పించాయని ఆమె స్నేహితులు చెప్పారు.ఈ ఫోటోలను ఆమె ఫేస్‌బుక్ నుండి డిలీట్ చేసింది. ఫోన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి ఆమె నిలదీసింది. 

ఇది సున్నితమైన అంశం కావడంతో ఐ ఫోన్ సంస్థ ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్తగా డీల్ చేసింది. ఈ విషయమై విచారణ చేసింది. ఫోన్ రిపేర్ చేసే ఇద్దరు టెక్నీషీయన్లు ఆ ఫోటోలు, వీడియోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసినట్టుగా తేలింది.  దీంతో ఈ ఇద్దరిని ఉద్యోగాల నుండి తొలగించారు. విద్యార్ధినితో ఈ విషయమై కంపెనీ ఒప్పందం చేసుకొంది. విద్యార్ధినికి 5 మిలియన్ డాలర్లను పరిహారంగా ఇచ్చేందుకు ఐ ఫోన్ ప్రతినిధులు అంగీకరించారు.  కానీ ఈ విషయాన్ని ఓ మీడియా బట్టబయలు చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios