‘ ఆమె పోర్న్ స్టార్.. ఆమె మాటలు నమ్మకండి’

‘ ఆమె పోర్న్ స్టార్.. ఆమె మాటలు నమ్మకండి’

ట్రంప్ మద్దతు దారులు తన ఫోన్ కాల్స్ రికార్డ్ చేస్తున్నారని, తనను వేధిస్తున్నారని  పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి  తనతో శారీరక సంబంధం ఉందంటూ.. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయం బయట పెట్టకూడదంటూ.. ట్రంప్‌ .. తనకు 1,30,000 అమెరికన్‌ డాలర్లు తనకు ఆఫర్‌ చేశారని ఆమె చెప్పడం అప్పట్లో సంచలనం రేపింది.

కాగా.. ఇటీవల ఆమెపై ట్రంప్ లాయర్  సంచలన వ్యాఖ్యలు చేశారు. డేనియల్స్‌ పోర్న్‌స్టార్‌ అని, ఆమె మాటల్ని ఎవరు నమ్మవద్దని చెప్పాడు. దీంతో.. అతని వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. ట్రంప్‌తో సంబంధాలు బయట పెట్టినందుకు న్యూయార్క్‌ మాజీ మేయర్‌, ట్రంప్‌ లాయర్‌ రుడీ గిలియానీ, డేవిడ్‌సన్‌ తనను ఉద్దేశపూర్వకంగానే వేధింపులకు గురిచేస్తున్నారని వెల్లడించారు. 

తనపై నిఘా ఉంచిన ట్రంప్‌ మద్దతుదారులు తన ఫోన్‌కాల్స్‌ను రహస్యంగా రికార్డ్‌ చేశారని తాజాగా ఆరోపించారు. ప్రణాళికా ప్రకరమే తనపై, తన లాయర్‌ మైఖెల్‌ అవెనట్టిపై లేని వదంతులు ప్రచారం చేస్తున్నారని పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌ మండిపడ్డారు. తన మాజీ లాయర్ ని కూడా ట్రంప్ కీలుబొమ్మలా చేసుకొని ఆడిస్తున్నాడని ఆమె ఆరోపించారు. 

స్టార్మీ డేనియల్స్‌ లాయర్‌ అవెనట్టి మాట్లాడుతూ.. ట్రంప్‌ లాయర్‌ గిలియానీ ఓ పంది అని వ్యాఖ్యానించారు. ట్రంప్‌తో శారీరక సంబంధాలు స్టార్మీ డేనియల్స్‌​ కొనసాగించడం వాస్తవమేనన్న అవెనట్టి, డేవిడ్‌సన్‌ ఈ నిజాన్ని అవాస్తవంగా చిత్రీకరిండానికి యత్నిస్తున్నారని ఆరోపించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM INTERNATIONAL

Next page