ఓక్లహోమా: తల్లితో వివాహేతర సంబంధం కలిగిన 63 ఏళ్ల వ్యక్తి 15 ఏళ్ల ఆమె కూతురిపై కూడ కన్నేశాడు.  ఆ బాలికను ఓ గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 9 మంది పిల్లలకు ఆ బాలికను తల్లిని చేశాడు.  తన పిల్లలతో కలిసి ఆ బాలిక తప్పించుకొని అతడిపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.

హెన్రీ మిచెల్ పీట్టె అనే వ్యక్తి 1997లో ఓక్లహోమాలోని పోటౌలోని తల్లితో కలిసి ఉంటున్న బాలికను తీసుకెళ్లి తన ఇంట్లో బందీ చేశాడు. బాలిక తల్లితో హెన్రీకి వివాహేతర సంబంధం ఉంది. దీంతో ఆమె ఇంటికి  ఆయన తరచూ వెళ్లేవాడు.  ఈ క్రమంలోనే తన ప్రియురాలి కూతురిపై ఆయన కన్నేశాడు.  ఆ సమయంలో ఆ బాలిక వయస్సు 15 ఏళ్లు.

ఆ బాలికను హెన్నీ మిచెల్ పీట్టే  కిడ్నాప్ చేశాడు.  ఓ గదిలో బంధించాడు. ఆమెపై రేప్ కు పాల్పడ్డాడు. 20 ఏళ్లుగా  ఆ బాలికను ఆ గదిలో బంధించి అత్యాచారం చేసేవాడు.  2000 సంవత్సరంలో  ఆ బాలిక మొదటి బిడ్డకు జన్మను ఇచ్చింది.  2016 వరకు ఆమె 9 మంది పిల్లలకు తల్లి అయింది. 2016 జూలైలో తన 9 మంది పిల్లలతో ఆమె హెన్రీ నుండి తప్పించుకొంది. అనంతరం మెక్సీకోలోని నొగేలెస్‌లో గల యూఎస్ కాన్సులర్ జనరల్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేసింది.

2017 డిసెంబర్ హెన్రీపై ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ చేత అభియోగం మోపారు. ఈ నెల 6వ తేదీన ఈ కేసు విచారణకు వచ్చింది. రెండు దశాబ్దాలుగా వృద్దుడు ప్రవర్తించిన తీరును బాధితురాలు వివరించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈ కేసు త్వరలోనే తీర్పు  వెలువడే అవకాశం ఉంది.