Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్... సింగపూర్ లో పర్యటించొద్దంటూ హెచ్చరికలు

చైనా దేశం తర్వాత సింగపూర్ దేశంలోనే అత్యధికంగా 45 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో సింగపూర్ దేశంలో పర్యటించే ఇండోనేషియా, తైవాన్ దేశాల పౌరులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించాయి.

Singapore postpones mass gatherings following increase of coronavirus alert level
Author
Hyderabad, First Published Feb 12, 2020, 9:10 AM IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఎఫెక్ట్ ఇప్పుడు సింగపూర్ కి కూడా పాకింది. చైనాలోని వుహాన్ లో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు సింగపూర్ దేశానికి కూడా వ్యాపించిందని అధికారులు స్పష్టం చేశారు. ఎవరూ సింగపూర్ లో పర్యటించవద్దంటూ పలు దేశాలు తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి.

Also Read కరోనా వైరస్... పేరు మారింది..!

దక్షిణ కొరియా, ఇజ్రాయిల్ దేశాల పౌరులు సింగపూర్ దేశ పర్యటనకు వెళ్లవద్దని ఆయా దేశాలు తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. చైనా దేశం తర్వాత సింగపూర్ దేశంలోనే అత్యధికంగా 45 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో సింగపూర్ దేశంలో పర్యటించే ఇండోనేషియా, తైవాన్ దేశాల పౌరులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించాయి.

 చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ 40వేల మందికి సోకగా, వెయ్యిమందికి పైగా రోగులు మరణించిన నేపథ్యంలో ఖతార్ దేశం కూడా తమ దేశ పౌరులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. 30 శాతం మంది పర్యాటకులు సింగపూర్ దేశ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారని, 19 శాతం సందర్శకుల సంఖ్య తగ్గిందని సింగపూర్ టూరిజం బోర్డు ప్రకటించింది. 9 ఆసియా దేశాల్లో పర్యటించవద్దని ఇజ్రాయిల్ వైద్యఆరోగ్యశాఖ మంత్రి యకావ్ లిట్జమాన్ తమ దేశ పౌరులకు సూచించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios