93 మంది అమ్మాయిలను అనుభవించి అనంతరం వారిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్‌ను అమెరికా పోలీసులు గుర్తించారు. 1980 నుంచి 1990 మధ్యకాలంలో అంతుచిక్కని హత్యలు, మహిళల అదృశ్య ఘటనల వెనుక చిక్కుముడులు విప్పేందుకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది.

ఈ నేపథ్యంలో 1980లలో ముగ్గురు మహిళల హత్య కేసుల్లో నిందితుడైన శామ్యూల్ లిటిల్‌ను దర్యాప్తు బృందం కలిసింది. ఈ మూడు హత్యలకు గాను ఆయనకు 2014లో యావజ్జీవ కారాగార శిక్ష పడింది.

లాస్ ఏంజెలిస్ జైల్లో ప్రస్తుతం పెరోల్ కూడా లేకుండా శిక్ష అనుభవిస్తున్నాడు. మొదటిసారి ఈ ఏడాది మే నెలలో శామ్యూల్‌ను కలిసిన ఎఫ్‌బీఐ అధికారులు పదే పదే అతనిని విచారించడం ద్వారా పలు కేసుల్లోని చిక్కుముడులు విప్పగలిగింది.

ఈ క్రమంలో సుమారు 93 మందితో శృంగారం చేసి అనంతరం పాశవికంగా హత్య చేసినట్లు శామ్యూల్ తెలిపాడు. 79 ఏళ్ల శామ్యూల్ లిటల్ తొలుత బాక్సర్. చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ సొమ్ముతో జల్సాలు చేసే వాడు.

అదే సమయంలో అతనిలో ఒక సైకో సైతం ఉన్నాడు. ఆడవారితో  శృంగారం చేసిన అనంతరం వారిని నగ్నంగా చేసి హత్య చేసేవాడు. చంపిన తర్వాత నగ్నంగానే రోడ్డు పక్కన చెత్త కుండీల్లో, కాల్వల్లో పడేసేవాడు.

కొంతమందినైతే కనీసం పేర్లు తెలుసుకోకుండానే లైంగికంగా అనుభవించి హత్య చేశానని లిటిల్ తెలిపాడు. కొత్త వారితో శృంగారం చేయడానికి పాత ప్రియురాళ్లు అడ్డుగా ఉంటారని భావించిన శామ్యూల్ వారిని ఒక్కొక్కరిగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

వీరిలో ఎక్కువ మంది వ్యభిచారిణులు, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారేనట. తను చంపిన వారి ముఖ కవలికలు, అందచందాలను సైతం శామ్యూల్ ఇప్పటికీ గుర్తుంచుకున్నాడు.

జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరేషన్.. రోజుకు ఎంతంటే?

అంతేకాదు దర్యాపత్తు అధికారులకు బొమ్మలు గీసి మరి చూపించాడు. తనపై పోలీసులు నమోదు చేస్తున్న కేసులపై శామ్యూల్ లిటిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను ఏ అమ్మాయిపై అత్యాచారం చేయలేదని.. వారి ఇష్టపూర్వకంగానే తనతో సెక్స్‌లో పాల్గొన్నారని వెల్లడించాడు.,

తాను హంతకుడిని మాత్రమేనని అనవసరంగా తనపై సెక్స్ ప్రిడేటర్ అన్న ముద్ర వేస్తున్నారని శామ్యూల్ ఎద్దేవా చేశాడు. మరోవైపు అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ఎక్కువమందిని చంపిన సీరియల్ కిల్లర్‌గా లారీ డ్రైవర్ గేరి రిడ్జ్‌వే పేరిట ఉండేది.

‘‘గ్రీన్ రివర్ కిల్లర్‌’’గా పేరు పొందిన రిడ్జ్ 1980 నుంచి 1990 దశకంలో 49 హత్యలు చేశాడు. అనంతరం జరిగిన విచారణలో తాను మరో 20 హత్యలు చేసినట్లు అంగీకరించాడు. అయితే ఇప్పుడు ఆ రికార్డును శామ్యూల్ అధిగమించాడు.