లేడీస్ హాస్టల్ లో సీక్రెట్ కెమేరాలు ఏర్పాటు చేసి.. అమ్మాయిలు దుస్తులు మార్చుకుంటుండగా.. వీడియోలు తీశారు. ఆ తర్వాత ఆ వీడియోలను ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశారు.  

కాగా.. ఓ యువకుడికి తన ప్రేయసి వీడియోలు కనపడటంతో చూసి షాకై అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన బంగ్లాదేశ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే..బంగ్లా రాజధాని ఢాకాలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా వర్కింగ్ ఉమెన్, విద్యార్థినులు ఎక్కువగా ఉండే ఓ  ఓ ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చారు. 

ఈ విషయం సదరు అమ్మాయిలకు తెలియకపోవడంతో.. తనకు నచ్చినట్లుగా ఉన్నారు. అయితే.. ఆ కెమేరాల్లో అమ్మాయిల ప్రైవేటు వ్యవహారాలన్నీ రికార్డు అయ్యాయి.

ఆ తర్వాత కొద్ది రోజులకు అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఇంటర్నెట్ ప్రత్యక్షం కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మాయిలు బట్టలు మార్చుకుంటున్న వీడియోలు అదే హాస్టల్‌లో ఉంటున్న ఓ యువతి బాయ్‌ఫ్రెండ్ కంటపడ్డాయి. 

వాటిలో తన గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉండడంతో కంగుతిన్న యువకుడు.. ఆ విషయం ప్రియురాలికి చెప్పడంతో అసలు విషయం బయటపడింది.

అనుమానం వచ్చిన అమ్మాయిలు గదిలో క్షుణ్ణంగా పరిశీలించడంతో నాలుగు సీక్రెట్ కెమెరాలు బయటపడ్డాయి. అదే విషయమై హాస్టల్ నిర్వాహకుడిని నిలదీయడంతో తనకేమీ సంబంధం లేదని.. అవి గదుల్లోకి ఎలా వచ్చాయో తమకు తెలియదని బుకాయించారు. 

విషయం పోలీస్ స్టేషన్‌కి చేరడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే వ్యక్తితో కలసి సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తేలింది. సుమారు 2వేల వీడియోలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.మయ ్కుో్జ.సప