Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం: 83 మంది మృతి..?

ప్రపంచాన్ని వరుస విమాన ప్రమాదాలు వణికిస్తున్నాయి. 83మందితో ప్రయాణిస్తున్న జాతీయ విమానయాన సంస్థ ఆరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్ విమానం సెంట్రల్ ప్రావిన్స్‌లోని గజనీలో కూలిపోయినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Plane carrying 83 crashes in central Afghanistan
Author
Kabul, First Published Jan 27, 2020, 3:44 PM IST

ప్రపంచాన్ని వరుస విమాన ప్రమాదాలు వణికిస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌లో సోమవారం మరో విమాన ప్రమాదం సంభవించింది. జాతీయ విమానయాన సంస్థ ఆరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్‌‌కు చెందిన ఎఫ్‌జీ507 విమానం 83 మందితో హెరాత్ నుంచి కాబూల్‌కు బయల్దేరింది.

ఈ నేపథ్యంలో తూర్పు గజినీ ప్రావిన్స్‌లోని పర్వతాలతో నిండిన దేహ్ యాక్ జిల్లాలోని సాడో ఖేల్ ప్రాంతంలో విమానం కుప్పకూలినట్లుగా తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.15 గంటలకు కాబూల్‌కు ఆగ్నేయంగా ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక మీడియా తెలిపింది.

నివేదికల ప్రకారం.. తాలిబన్లు ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి చేరుకుని మండలను ఆర్పే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రాంతం తాలిబన్ల ఆధీనంలో ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడానికి వారితో ప్రభుత్వం చర్చలు జరపాల్సి ఉంటుంది. గజనీ ప్రావిన్షియల్ గవర్నర్ అధికారిక ప్రతినిధి ఆరిఫ్ నూరి ఈ ప్రమాదాన్ని ధ్రువీకరించారు. 

Also Read:

అమెరికాలో కూలిన విమానం... నలుగురు మృతి

ఇరాన్ లో ఘోర విమాన ప్రమాదం... 167మంది మృతి

Follow Us:
Download App:
  • android
  • ios