Asianet News TeluguAsianet News Telugu

విమానంలో న్యూడ్ ఫొటోల రచ్చ.. చిర్రెత్తుకొచ్చిన పైలట్ వార్నింగ్.. ‘ఫ్లైట్ రిటర్న్ తీసుకెళ్తా’

విమానంలో ప్రయాణిస్తుండగా కొందరు ప్రయాణికులు తమ ఐఫోన్‌లల్లో న్యూడ్ ఫొటోలు షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోలను భరించలేక ఓ ప్రయాణికుడు ఎయిర్ స్టాఫ్‌కు ఫిర్యాదు చేశాడు. పైలట్ వెంటనే ప్రయాణికులకు ఓ వార్నింగ్ ఇచ్చాడు. ఈ వ్యవహారం మానుకోకపోతే ఫ్లైట్ రిటర్న్ తీసుకెళ్లుతా అని బెదిరించాడు.

pilot warned passengers that he may take flight back after discovering nude photos sharing in flight
Author
First Published Sep 3, 2022, 5:16 PM IST

న్యూఢిల్లీ: ఓ విమానం టేకాఫ్ అయింది. ప్రయాణం సజావుగా సాగుతున్నది. కానీ, ప్యాసింజర్లు ఓ కొత్త రచ్చను మొదలు పెట్టారు. తమ ఐఫోన్‌ల ద్వారా న్యూడ్ ఫొటోలను షేర్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఎవరికి పడితే వారికే న్యూడ్ ఫొటోలు పంపారు. ఈ విషయం కాస్తా క్యాబిన్‌లోని ఫ్లైట్ స్టాఫ్‌కు తెలిసింది. విసుగొచ్చిన పైలట్ ప్యాసింజర్స్ పై సీరియస్ అయ్యారు. వెంటనే న్యూడ్ ఫొటోలు షేర్ చేసుకోవడం ఆపేయాలని డిమాండ్ చేశారు. లేదంటే.. ఫ్లైట్ రిటర్న్ తీసుకెళ్లుతానని, పోలీసులు విచారించాల్సి ఉంటుందని, తద్వార ప్రయాణికుల వెకేషన్ పూర్తిగా నాశనం అయిపోతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఘటనను ఓ ప్యాసింజర్ పూర్తిగా రికార్డు చేశాడు. టెగ్ర్ మార్సాలిస్ అనే వ్యక్తి రికార్డు చేసి టిక్ టాక్‌లో అప్‌లోడ్ చేశాడు.

ఫ్లైట్‌లో న్యూడ్ ఫొటోలతో పైలట్‌కు చిర్రెత్తుకొచ్చింది. పైలట్ ఇంటర్‌కామ్ తీసుకుని ప్రయాణికులకు వార్నింగ్ ఇచ్చాడు. ఒక డీల్ చెబుతున్నానని అనౌన్స్ చేశాడు. ఇది ఇలాగే కొనసాగితే ఫ్లైట్‌ను తిరిగి వెనక్కి తీసుకెళ్లతా అని వివరించారు. ప్రతి ఒక్కరూ ఫ్లైట్ నుంచి దిగాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో సెక్యూరిటీ అధికారులు కూడా ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. తద్వార ప్రయాణికుల వెకేషన్ మొత్తం పాడైపోతుందని తెలిపారు. కాబట్టి, మీరు మాట్లాడే ఎయిర్ డ్రాప్‌ను వెంటనే మానేయాలని, నగ్న చిత్రాలను పంపడం ఆపేయాలని కోరారు. ఎవరి సీట్లలో వారు నిశ్చలంగా కూర్చోవాలని సూచించారు. ఈ మేరకు ఆ టిక్ టాక్ వీడియోలో కనిపిస్తున్నది.

ఐఫోన్‌లోని ఓ ఫీచర్ ఈ ఎయిర్ డ్రాప్. ఇంటర్నెట్ లేకున్నా.. ఐఓఎస్ డివైజుల నుంచి ఫొటోలు, వీడియోలు, పెద్ద పెద్ద ఫైళ్లున కూడా పంపించుకోవచ్చు. వైఫై, సెల్యూలర్ కనెక్షన్ లేకున్నా.. వీటిని షేర్ చేసుకోవచ్చు. అయితే, ఇందులోనూ అంచల వారీగా భద్రతాపరమైన ఆప్షన్లు ఉంటాయి. ఎవరైనా తన డివైజ్‌ను కనుగొనవచ్చనే ఆప్షన్ ఎంచుకుంటే.. మనకు పరిచయం లేని వారు కూడా తమ డివైజ్ వారి డివైజ్‌లో డిస్కవరీ అయితే.. షేర్ చేసుకోవచ్చు.

దీంతో ఓ ప్రయాణికుడు తనకు న్యూడ్ ఫొటోలు వచ్చాయని స్టాఫ్‌కు ఫిర్యాదు ఇచ్చాడు. ఎయిర్ స్టాఫ్‌కు కూడా ఈ ఫొటోలు వెళ్లి ఉంటాయని ఆ టిక్ టాక్ హ్యాండిలర్ తెలిపాడు. కానీ, విచారణలో తిరస్కరించారని వివరించాడు. ఈ ఘటన జరిగినట్టు సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ ధ్రువీకరించింది. ఈ పొటెన్షియల్ ప్రాబ్లెమ్‌ను తమ స్టాఫ్ వెంటనే గుర్తించిందని, అందుకు తగినట్టుగా ఇతర ప్రయాణికుల సౌకర్యం కోసం చర్యలు తీసుకున్నారని తెలిపింది.

అపరిచితులకు వారి అనుమతి లేకుండా న్యూడ్ ఫొటోలు పంపడం చాలా దేశాల్లో నేరంగానే ఉన్నది.

Follow Us:
Download App:
  • android
  • ios