పాకిస్తాన్ ప్రధాని కాకర్ లవ్ గురు అవతారం ఎత్తారు. ఆయన ప్రేమ, పెళ్లి సందేహాలను నివృత్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది. 

Love Guru: పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ లవ్ గురు అవతారం ఎత్తారు. పౌరులు అడిగిన ప్రేమ, పెళ్లి, ఇతర వ్యక్తిగత సంబంధమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇలాంటి సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

చేతిలో డబ్బు లేకున్నా ఒకరిని ఇంప్రెస్ చేయడం ఎలా? నాకు 52 ఏళ్లు. ఈ వయసులోనూ పెళ్లి చేసుకోవచ్చా? విదేశాల్లో వచ్చిన ఉద్యోగం కోసం ఇష్ట సఖిని వదిలిపెట్టాలా?.. ఇలా ప్రశ్నలు వచ్చాయి. ఈ ప్రశ్నలకు పాక్ ప్రధాని కాకర్ సమాధానాలు చెప్పారు.

వీటికి కాకర్ సమాధానాలు ఇలా ఇచ్చారు. ‘52 ఏళ్ల వయసులోనైనా పెళ్లి చేసుకోవచ్చు. 82 ఏళ్ల వయసులో ఉన్నా.. ఈ విధంగా ఆలోచించవచ్చు’ అని సమాధానం ఇచ్చారు. చేతిలో డబ్బులు లేకున్నా ఎలా ఇంప్రెస్ చేయాలి అనే ప్రశ్నకు సమాధానంగా.. ‘నేను ఇది వరకు నా జీవితంలో ఎవరినీ ఇంప్రెస్ చేయలేదు. కానీ, చాలా మందికి నేను ఇంప్రెస్ అయ్యాను’ అని వివరించారు. 

Also Read: Lok Sabha Elections: పార్లమెంటు ఎన్నికల్లో హంగ్.. మాయావతి వ్యూహం ఏమిటో తెలుసా?

Scroll to load tweet…

ఇక విదేశాల్లో ఉద్యోగం, ప్రియ సఖి ప్రశ్న గురించి స్పందిస్తూ.. ‘ ప్రేమ అనేది అనుకోకుండా పుట్టి ఉండొచ్చు. ఉద్యోగం అనేది నీ సామర్థ్యాన్ని బట్టి వచ్చింది. కాబట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి మళ్లీ ఉద్యోగం పొందే అవకాశం నీకు ఉంటుంది. చాన్స్ మిస్ చేసుకోవద్దు’ అని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ ప్రధాని ఇలా లవ్ గురు అవతారం ఎత్తడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది.