కరోనా కల్లోలంలో అందరూ షేక్ హ్యాండ్స్ హగ్గులు ఇచ్చుకునేందుకు భయపడుతున్న పరిస్థితి. ఈ టైంలో అపరిచితులతో శృంగారం మొత్తం ఔత్సాహికులంతా బంద్ చేశారు. మహమ్మారి వైరస్ సోకకుండా అందరూ జాగ్రత్తలు పడుతున్నారు.

ఈ వైరస్ గురించి తెలియని వాళ్లు ఏదైనా పొరపాట్లు చేయడం సాధారణం. కానీ.. వైరస్ గురించి తెలిసి కూడా ఓ నర్స్ దారుణానికి పాల్పడింది.

ఇండోనేషియాలో ఇటీవల ఓ దారుణం జరిగింది. కరోనా నిబంధనలకు తిలోదకాలిచ్చిన ఓ నర్సు ఏకంగా కరోనా పేషెంట్‌లో శృంగారంలో పాల్గొంది. సదరు కరోనా పేషెంట్ స్వయంగా ఈ విషయాల్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తాలూకు వాట్సాప్ స్క్రీన్ షాట్స్‌ను కూడా అతడు ఫేస్ బుక్‌లో షేర్ చేశాడు. 

రాజధాని జకార్తాలోని విస్మా అట్లెట్ క్వారంటైన్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. సదరు నర్సు..తన పీపీఈ కిట్ తొలగించి..ఆస్పత్రి వాష్‌రూమ్‌లో అతడికి దగ్గరైనట్టు బయటపడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు.

 ప్రస్తుతం ఇద్దరూ క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు సదరు నర్సును అక్కడి అధికారులు సస్పెండ్ చేశారు. నిందితులిద్దరిపై పోలీసు కేసు కూడా నమోదైంది. కాగా.. నర్సుకు కరోనా టెస్టు జరపగా నెగెటివ్ అని వచ్చినట్టు స్థానిక అధికారులు తెలిపారు.

కరోనా నిబంధనలను ఇలా ఉల్లంఘించినందుకు వారిద్దరిపై కేసు నమోదు చేశారు.ఏదేమైనా కామంతో కక్కుర్తి పడ్డ ఆ నర్సుకు శిక్ష పడటమే కాకుండా ఆమెకు సహకరించిన కరోనా రోగికి కూడా అధికారులు శిక్ష విధించారు.

కరోనా విజృంభిస్తున్న వేళ ఇలాంటి పాడుపని చేయాలని ఆ నర్సుకు ఎందుకు అనిపించిందా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.ఇక ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.