బతికున్న కప్ప కాలిమీద మొలిచిన పుట్టగొడుగు..

లైవ్ ఆర్గానిజం మీద పుట్టగొడుగులు పెరగడం ఇంతకు ముందు ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Mushroom sprouted on the leg of a living frog - bsb

ఢిల్లీ : భారతదేశంలోని పశ్చిమ కనుమలలోని అడవుల్లో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు ఓ ఆశ్చర్యకరమైన కనిపించింది. ఓ కప్ప వీరికి విచిత్రంగా కనిపించింది. అనుమానంతో దాన్ని పట్టుకుని చూడగా.. దాని కాలు నుండి ఒక చిన్న పుట్టగొడుగు మొలకెత్తుతుండడం గమనించారు. అది చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. 

ప్రత్యక్ష జంతువుల కణజాలంపై పుట్టగొడుగు పెరుగుతున్నట్లు గుర్తించడం ఇదే మొదటిసారి అని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్‌తో అనుబంధంగా ఉన్న పరిశోధకులు తెలిపారు.

కప్పను మరింత అధ్యయనం చేయడానికి ఆ కప్పను వారు పట్టుకోలేకపోయారు. కానీ దానికి సంబంధించిన ఫొటోలు మాత్రం తీయగలిగారు. ఇప్పుడు కప్ప వెనుక కాలు దగ్గర పెరుగుతున్న పుట్టగొడుగు ఉన్న ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్ గా మారుతున్నాయి. 

త్రిపుర కాలేజీలో చీరలేని సరస్వతి విగ్రహం.. ఆందోళన చేపట్టిన ఏబీవీపీ, భజరంగ్ దళ్..

రావ్స్ ఇంటర్మీడియట్ గోల్డెన్-బ్యాక్డ్ ఫ్రాగ్ (హైలారానా ఇంటర్మీడియా) అని పిలువబడే ఈ కప్ప జాతి, పశ్చిమ కనుల ప్రాంతానికి చెందిన జీవి. ఇది ప్రపంచంలోని అత్యంత జీవవైవిధ్యాలలో ఒకటి. కప్ప కాలు మీద పెరుగుతున్న ఈ పుట్టగొడుగును శిలీంధ్ర నిపుణులుబోనెట్ మష్రూమ్ గా గుర్తించారు, ఇది ఎక్కువగా కుళ్ళిన చెక్కపై మొలుస్తుంది.

మామూలుగా సజీవ జంతుజాలం మీద బ్యాక్టీరియా, శిలీంధ్రాలతో పాటు.. అనేక రకాల సూక్ష్మజీవులు ఉంటుంటాయి. ఇవి ఆ జీవులతో పాటు పెరుగుతుంటాయి. అవి పెద్దగా ప్రమాదకరం కాదు. కానీ, కొన్నిసార్లు అథ్లెట్స్ ఫుట్, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు లేదా నోటి ఫంగల్ వ్యాధి కాన్డిడియాసిస్ వంటి ఫంగైస్ వంటి కొన్ని ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు.

ఏది ఏమైనప్పటికీ, సరీసృపాలు, ఉభయచరాలు అనే జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, సజీవ జీవిపై పెరుగుతున్న పుట్టగొడుగు ఇంతకు ముందెప్పుడూ నమోదు చేయబడలేదు. దీనిమీద పరిశోధకులు మాట్లాడుతూ... "మాకు తెలిసినంతవరకు, సజీవ కప్ప పక్క భాగాలనుంచి నుండి పుట్టగొడుగులు మొలకెత్తడం  ఎప్పుడూ రికార్డ్ కాలేదు" అని తెలిపారు.

ఎందుకంటే పుట్టగొడుగులు పెరగడానికి కావాల్సిన పోషకాలు సజీవ జంతువుల చర్మం మీద తగినంతగా ఉండకపోవడమే దీనికి కారణం. ఈ ఘటనలో.. పశ్చిమ కనుమల్లో తేమతో కూడిన, రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల,  పుట్టగొడుగుల పెరుగుదలకు అనువైన వాతావరణం ఉండొచ్చని.. అదే సేంద్రియ పదార్థాలను అందించిందని.. అందుకే ఇలా జరిగి ఉండొచ్చని పరిశోధకులు అనుమానిస్తున్నారు.

కప్పపై పెరుగుతున్న పుట్టగొడుగు ఖచ్చితమైన స్వభావం ఏమిటి? ఇది అంటువ్యాధా? పెద్దగా ప్రమాదకారి కాదా? పుట్టగొడుగు చర్మంలోకి ఎంత లోతుగా చొచ్చుకుపోయింది.. అనే విషయాలు అస్పష్టంగానే ఉన్నాయి.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కప్పలు, వందలాది ఇతర ఉభయచర జాతులు Batrachochytrium dendrobatidis అని పిలువబడే పరాన్నజీవి శిలీంధ్రం వల్ల ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో సజీవ కప్పమీద పుట్టగొడుగు పెరగడం అనేది ఆందోళనను పెంచింది. దీనిని సాధారణంగా చైట్రిడ్ ఫంగస్ అని పిలుస్తారు.

చైట్రిడ్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉభయచర జనాభా కాలక్రమేణా క్షీణించడానికి కారణం అయ్యింది. ఎందుకంటే, అవి ఈ జాతుల జీవుల చర్మంపై నీరు, ఉప్పుల సమతుల్యతను దెబ్బతీసి.. వాటి గుండె ఫెయిల్ అవ్వడానికి దారి తీస్తుంది. అయితే భారతదేశం అంతటా కప్పలు ఎక్కువగా కనిపించే హాట్‌స్పాట్‌లలో ఈ ఉభయచర కిల్లర్ ఫంగస్ తక్కువ స్థాయిలోనే ఉందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios