Asianet News TeluguAsianet News Telugu

కరోనా గుర్తింపుకు శునకాలు: లండన్ శాస్త్రవేత్తల ప్రయోగం

కోవిడ్ 19ను గుర్తించడంలో రానున్న ఆరువారాల్లో తమ కుక్కలకు శిక్షణ ఇవ్వడానికి ఆ ఛారిటీ సంస్థ లండన్‌లోని స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌తో కలిసి పనిచేయడానికి తాము అంగీకరించినట్లు ఆ సంస్థ డాక్టర్ క్లేర్ గెస్ట్ తెలిపారు
medical dogs help fight on coronavirus
Author
London, First Published Apr 14, 2020, 8:36 PM IST
ఏ వ్యాధినైనా సరిగ్గా నిర్థారిస్తేనే దానికి చికిత్స చేయగలం. అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను నిర్థారించడానికి ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి.

ఎందుకంటే వ్యాధి సోకిన తర్వాత 14 నుంచి 21 రోజుల వ్యవధిలో దీని లక్షణాలు బయటపడటం ఒకటైతే, రక్తనమూనాలకు ల్యాబ్‌కు పంపి.. అక్కడి నుంచి రిజల్ట్ రావడానికి జాప్యం జరుగుతోంది.

దీంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని అర సెకన్ వ్యవధిలోనే కుక్కలు గుర్తిస్తాయని లండన్‌లోని మెడికల్ డిటెక్షన్ డాగ్స్ చారిటీ తెలిపింది.

కోవిడ్ 19ను గుర్తించడంలో రానున్న ఆరువారాల్లో తమ కుక్కలకు శిక్షణ ఇవ్వడానికి ఆ ఛారిటీ సంస్థ లండన్‌లోని స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌తో కలిసి పనిచేయడానికి తాము అంగీకరించినట్లు ఆ సంస్థ డాక్టర్ క్లేర్ గెస్ట్ తెలిపారు.

కరోనా వైరస్‌ను గుర్తించేలా తమ సంస్థ కుక్కలకు శిక్షణ ఇవ్వడానికి ఆరు వారాల సమయం పడుతుందని, లాక్‌డౌన్ ఎత్తివేశాక మున్ముందు విమానాశ్రయాల వద్ద, రైల్వే స్టేషన్ల వద్ద శిక్షణ పొందిన కుక్కల పొందిన కుక్కల అవసరం ఉందని ఆమె తెలిపారు.

ఒకేసారి విమానాశ్రయం నుంచి ఐదు వందల మంది ప్రయాణికులు బయటకు వచ్చినా, పది నిమిషాల్లో వారందరికీ స్కానింగ్ చేసి వైరస్‌ బాధితులను శిక్షణ పొందిన మెడికల్ డాగ్స్ గుర్తించగలవని క్లేర్ గెస్ట్ తెలిపారు.

ప్రస్తుతం తమ వద్ద శిక్షణ పొందిన లాబ్రడార్ తలా, ఎమాన్ హోల్మ్, రుత్‌లాంగ్స్‌ ఫోర్డ్ జాతి శిక్షణ పొందిన కుక్కలకు 350 సెన్సార్ల గ్రాహక శక్తి ఉండటమే అందుకు కారణమని ఆమె చెప్పారు.

రెండు ఒలింపిక్ పరిమాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్స్‌ను ఒకటిగా చేసి అందులో ఓ టీ స్పూన్ చక్కెరను చేస్తే దాని వాసనను పరిమాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్స్‌ను ఒకటిగా చేసి అందులో ఓ టీ స్పూన్ చక్కెరను వేస్తే దాని వాసనను గుర్తించేందుకు ఎంతటి గ్రాహక శక్తి కావాలో , అంతటి గ్రాహక శక్తి కుక్కలకు ఉందని క్లేర్ గెస్ట్ వెల్లడించారు.

అదే మానవుడు ఒక కప్పు టీలో మాత్రమే చక్కెర వాసనను పసిగట్టగలడని చెప్పారు. సాధారణంగా మానవుడి వాసన గ్రాహక శక్తి ఐదు బిలియన్ సెన్సార్లు మాత్రమే చక్కెర వాసనను పసిగట్టగలడని ఆమె తెలిపారు.

మానవులకు కేవలం ఐదు బిలియన్ సెన్సార్ల గ్రాహక శక్తి మాత్రమే ఉంటుంది. పలు రోగాలను త్వరితగతిన గుర్తిచంచేందుకు మెడికల్ డాగ్స్ గుర్తిస్తున్నప్పటికీ ప్రపంచ వైద్య వ్యవస్థ వాటి సేవలను నేరుగా వినియోగించుకోవడం పట్ల ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. 
Follow Us:
Download App:
  • android
  • ios