పకృతి వైపరిత్యాలతో పంటలు దెబ్బతీని సతమవుతున్న రైతులకు ఇప్పుడు కొత్త  సమస్య వచ్చి పడింది.  ఇప్పుడు గుజారాత్ రైతులను మిడతలు  బెంబేలెత్తుస్తున్నాయి. పాకిస్థాన్‌ నుంచి మిడతల దండు  భారత్‌ సరిహద్దుల్లోకి చోచ్చుకువచ్చి  పంటలకు తీవ్ర నష్టానికి కలగజేస్తున్నాయి. గుంపులుగా వచ్చిని మిడతలు గుజరాత్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతంలోకి విస్తరిస్తున్నాయి. దీంతో ఆందోళన చెందిన ఆ రాష్ట్రం కేంద్ర సహయాన్ని కొరింది. వెంటనే  స్పందించిన  కేంద్రం  కేంద్ర ప్రభుత్వం 11 బృందాలను గుజరాత్‌కు పంపింది.   

మిడతల నుంచి పంటలను కాపాడడం కోసం క్రిమిసంహారక మందులు చల్లించడం వంటి అనేక నిరోధక చర్యలను కేంద్ర బృందాలు మెుదలుపెట్టాయి. వాటిని ఎలా నిరోధించాలనే దానిపై  రైతులకు ఇప్పటికే సూచనలు చేశారు. అయినా వాటి నుంచి పంటలను రక్షించడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ ఘటనపై స్పందించిన గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ  మిడతల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే వాటి పూర్తిగా నిర్మూలిస్తామని  తెలిపారు.  దాదాపు 12000 వేల ఎకరాలలో పంటలకు నష్టం కలిగించాయి.

సరిహద్దులు దాటి 
 

ఈ మిడతలు ఆఫ్రికా దేశాలైన  సూడాన్‌, ఎరిట్రియా నుంచి సుదూర తీరాలను దాటి సౌదీ అరేబియా, ఇరాన్‌ ద్వారా పాకిస్థాన్‌లోకి ప్రవేశించాయి. పాక్ నుంచి వచ్చిన మిడతలు దశాబ్ద కాలంగా భారత్ సరిహద్దు గ్రామాలలో తిష్ట వేసి పంటలను నాశనం చేస్తున్నాయి. సింధ్‌ రాష్ట్రంలోని ఎడారి ప్రాంతం గుండా వచ్చిన మిడతలు రాజస్థాన్‌,గుజరాత్‌ రాష్ట్రాల గ్రామాలలో విస్తరించాయి. ఇవి దండు-దండులుగా సుదూర దూరాలకు వెళ్ళగలవు. ఒక్కో దండు విస్తృతి 30-35 చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇవి ఆఫ్రికా దేశాలలో వీటి దండులు ఎక్కువగా విస్తరించి ఉంటాయి.

దాదాపు దశాబ్దకాలం తర్వాత మిడతల దండు ఈ ప్రాంతాన్ని ముంచెత్తింది. ఇవి ఆఫ్రికాలోని సూడాన్‌, ఎరిట్రియా దేశాల నుంచి బయలుదేరాయి. సౌదీ అరేబియా, ఇరాన్‌ ద్వారా పాకిస్థాన్‌లోకి ప్రవేశించాయి. అక్కడి సింధ్‌ రాష్ట్రంలోని ఎడారి ప్రాంతం గుండా భారత్‌కు వచ్చాయి. వీటికి ఎక్కువ దూరం ఎగిరే సత్తా ఉంది. ఒక్కో దండు విస్తృతి ఏకంగా 30-35 చదరపు కిలోమీటర్ల మేర ఉంటోంది. గుజరాత్‌లో ఈసారి నైరుతి రుతుపవనాలు ఎక్కువ కాలం కొనసాగడంతో ఈ మిడతలు అక్కడే తిష్టవేశాయి. రాజస్థాన్‌లోని జాలోర్‌ జిల్లాలోనూ అవి ఉన్నాయి. మిడతల రాకపై ఐక్యరాజ్యసమితి(ఐరాస)కి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) హెచ్చరికలు చేసినప్పటికీ స్థానిక అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదని నిపుణులు పేర్కొన్నారు.   

 

అసలు ఏంటీ మిడతలు 

 వల్గర్ లాటిన్ లోకస్టా  పదం  నుండి "మిడుత"లు ఉద్భవించాయి. మిడతలు అక్రిడిడే జాతికి చెందిన కీటకాలు.  ఇవి గుంపులుగా గుంపులుగా సుదీర్ఘ ప్రయాణాలను చెస్తాయి.  ఈ కీటకాలు విషపూరితమైన  కావు.  వేగవంతమైన సంతోనత్పత్తిని కలిగి ఉంటాయి. అయితే ఇవి అంటే రైతుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతాయి. వీటి ఒక్కొక్క దండు 30-35 చదరపు కిలోమీటర్ల  ఉంటుంది. పంటలపై వీటి కన్ను పడిందా ఇక అంతే.. నిమిషాల వ్వవధిలోనే వేలాది ఎకరాలను నాశనం చేసి ఆ దేశ  వ్యవసాయరంగాన్ని పూర్తి స్ధాయిలో దెబ్బ తీసే సత్తా  వీటికి ఉంటుంది.  పంటలను దెబ్బ తీసి ఆ దేశాలను కరువు ఛాయాల్లోకి నెట్టగలవు. గంటల వ్వవధిలోనే సుదూర తీరాలకు ప్రయాణించగలవు. 
 

మిడతల ప్రస్థానం 

ఈ కీటకాలు  చరిత్ర  ప్రాచీనమైనది. ఈజిప్షియన్లు చరిత్రాకారులు వీటి ప్రస్థానం గురించి వివిధ గ్రంధాలలో వివరించారు.  ఈజిప్ట్ పూరతన సమాధులపైకూడా వీటి అనవాళ్ళ కనిపిస్తాయి. ఇలియడ్, బైబిల్  ఖురాన్లలో  ఈ కీటకాల పేర్లు ప్రస్తావించబడ్డాయి.సమూహాలుగా ఉంటూ  పంటలను నాశనం చేస్తాయి.  ఇవి సృష్టించే పరిణామాలు ఎంతటివి అంటే  ప్రభావం ఎంతటిది అంటే కరువు, వలసలకు లాంటి విపత్కర పరిణామాలకు ఇవి దారితీస్తాయి. అయితే ఇటీవల కాలం వ్యవసాయంలో అనుసరిస్తున్న నూతన పద్దతుల వల్ల పంటలపై వీటి దాడి నియంత్రించగలగుతున్నారు. అయినప్పటికీ అనేక ప్రాంతాలలో విస్తతంగా జాతి వృద్ది చెందుతుంది. సముహాలుగా వెళ్ళి పంటలను నాశనం చేస్తున్నాయి.

 

ప్రపంచ వ్యాప్తంగా వీటి ఉనికి 

భారత ఉపఖండం,ఉత్తర ఆఫ్రికా,ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్యం.  దేశాలలో మిడతలు విస్తృత్త స్ధాయిలో వ్యాపించి ఉన్నాయి.  2003-4లో పశ్చిమ ఆఫ్రికాలో దేశాలలో వీటి దాడులు వీపరితంగా ఉండేవి. మౌరిటానియా, మాలి, నైజర్ ,సుడాన్ దేశాల  ఈ కీటకాల దాటికి ప్రజలు వలసలు వెళ్ళే స్ధాయి వరకు వెళ్ళింది. ఈజిప్ట్, జోర్డాన్, ఇజ్రాయెల్‌ దేశాలలో కూడా మిడతలు తీవ్ర స్ధాయిలో పంటలకు నష్టం కలిగించాయి. దాదాపు 122 డాలర్ల మిలియన్లునష్టాన్ని కలగజేశాయి.

ఆహరంగా మిడతలు

మిడతలను వివిధ దేశాలలో ఆహరంగా కూడా తీసుకుంటారు.  అలాగే ఇవి వారి సంస్కృతిలో భాగం కూడా. ఆఫ్రికన్, మిడిల్ ఈస్టర్న్ ఆసియా దేశాలలో
వీటిని రుచి ఆహరంగా పరిగణిస్తారు. ఇస్లామిక్ సంస్కృతిలో  మిడతలు  హలాల్ గా పరిగణించబడుతుంది. ముహమ్మద్  ప్రవక్త తన సహచరులతో సైనిక దాడిలో పాల్గోంటున్న  మిడుతలను ఆహరంగా తీసుకున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అరేబియా ద్వీపకల్పంలోనూ మిడుతలను తింటారు