Asianet News TeluguAsianet News Telugu

కెమెరా అమర్చి నగ్న వీడియోలు తీసి మహిళను ఇలా...

దుబాయ్ లో ఓ ఇంట్లో రహస్యంగా కెమెరాను అమర్చిన ఓ వ్యక్తి ఆ వీడియోలను బయటపెడతానని బాధితురాలిని బెదిరించాడు. ఈ విషయమై బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. 

Man gets 9 months jail for blackmailing woman with nude video
Author
Dubai - United Arab Emirates, First Published May 26, 2019, 4:44 PM IST


దుబాయ్: దుబాయ్ లో ఓ ఇంట్లో రహస్యంగా కెమెరాను అమర్చిన ఓ వ్యక్తి ఆ వీడియోలను బయటపెడతానని బాధితురాలిని బెదిరించాడు. ఈ విషయమై బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడికి 9 మాసాల జైలు శిక్ష విదిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.

దుబాయ్‌లోని ఓ మేగజైన్‌లో ఇల్లు అద్దెకు ఉందని వ్యాపార ప్రకటన విడుదలైంది. ఈ యాడ్‌ చూసిన ఓ 49 ఏళ్ల మహిళ ఆ ఇంటి యజమానికి ఫోన్ చేసింది. ఆ ఇంట్లో అద్దెకు చేరింది. ఆ ఇంట్లో సామానును  కూడ ఇస్తామని ఆ వ్యాపార ప్రకటనలో ఓ వ్యాపార సంస్థ ప్రకటించింది. 

తన స్నేహితుడికి కూడ ఈ కంపెనీ గురించి ఈ వ్యాపార ప్రకటన గురించి ప్రస్తావించింది. అతను కూడ ఈ కంపెనీ తన సేవలను ఉపయోగించుకొన్నాడు. తన మిత్రుడికి ఈ కంపెనీని రికమండ్ చేసినందుకు గాను తన  కమీషన్ ఇవ్వాలని బాధితురాలు ఆ కంపెనీని ఆ వ్యాపార సంస్థను కోరింది. 

అయితే ఆ వ్యాపార సంస్థ మాత్రం బాధితురాలికి షాక్ ఇచ్చాడు. ఆ మహిళ  అద్దెకు ఉన్న ఇల్లులో తాము సామానును తరలించే సమయంలో రహస్యంగా ఓ కెమెరాను అమర్చినట్టుగా ఆ వ్యాపార సంస్థ చెప్పింది. అంతేకాదు ఆ మహిళ నగ్న వీడియోలు కూడ తన వద్ద ఉన్నాయని బాధితురాలిని బెదిరించాడు. 

కమీషన్ ‌ ఇవ్వకుండా ఈ నగ్న చిత్రాలను బయటపెడతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ నేరం రుజువు కావడంతో నిందితుడికి 9 మాసాలు జైలు శిక్ష విధించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios