Asianet News TeluguAsianet News Telugu

ఈ సూపర్ మ్యాన్ ను ఎప్పుడైనా చూశారా (వీడియో)

ఈ సూపర్ మ్యాన్ ను ఎప్పుడైనా చూశారా (వీడియో)

mali man saves paris child who hang balcony

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో కూడా తెలీని పరిస్థితి నెలకొనటం సహజం.  సమయస్ఫూర్తిని, తెగువను ప్రదర్శిస్తుంటారు. మాలికి చెందిన 22 ఏళ్ల మమౌడూ గస్సామా కూడా అదే జాబితాలోకి వస్తాడు.ఓ చిన్నారిని కాపాడి సూపర్‌ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఉత్తర ప్యారిస్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా, ఆ వీడియో సోషల్‌ మీడియాలో సర్క్యూలేట్‌ అవుతోంది.  నాలుగేళ్ల బాబు తాను ఉంటున్న ఫ్లాట్‌ బాల్కనీ నుంచి కిందకు వేలాడటం కొందరు స్థానికులు గమనించారు. వెంటనే ఫైర్‌ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. 

కింద జనం చేరి హాహాకారాలు చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మమౌడూ గస్సామా క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు దూకాడు. గబగబా పైకి భవనం ఎక్కడి ఆ పిల్లాడిని కాపాడే యత్నం చేశాడు. ఆ సమయంలో పక్క ప్లాట్‌లోని వ్యక్తి చిన్నారి జారకుండా ఒకచేత్తో అదిమి పట్టుకున్నాడు. నిమిషం వ్యవధిలోనే పైకి ఎక్కేసిన గస్సామా.. ఆ బాబును అమాంతం లాగేసి ప్రాణాలు కాపాడాడు.  గస్సామా సాహసంపై పారిస్‌ మేయర్‌ ప్రశంసలు గుప్పించగా, సోషల్‌ మీడియాలో అతన్ని హీరోగా, అభివర్ణిస్తున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios