Asianet News TeluguAsianet News Telugu

అమెరికా అధ్యక్ష పదవి రేసులో కిమ్ కర్దాషియన్!

హాలీవుడ్ అందాల భామ కిమ్ కర్దాషియన్ గురించి కొత్తగా పరిచయాలు చేసుకోవాల్సిన అవసరం లేదు.

Kim for US President? "Never say never,"

హాలీవుడ్ అందాల భామ కిమ్ కర్దాషియన్ గురించి కొత్తగా పరిచయాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. టెలివిజన్ రియాల్టీ షోలలో, హాలీవుడ్ చిత్రాలలో మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్ష పదవిపై కన్నేసినట్లు కనబడుతోంది. ఓ ఆంగ్ల టెలివిజన్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కిమ్ తన మనసులో మాట బయటకు చెప్పింది.

సదరు ఇంటర్వూలో జర్నలిస్టు, కిమ్ కర్దాషియన్‌ను వైట్ హౌస్ ఆఫీస్‌ని మీరు నడుపుతారా అని అడిగితే ప్రస్తుతం తన మెదడులో అలాంటి ఆలోచన ఏదీ లేదని, కానీ ఏదైనా జరగవచ్చని అన్నారు. మరి ఒకవేళ అధ్యక్షురాలిగా ఎన్నికైతే అంగీకరిస్తారా అని జర్నలిస్టు అడిగినప్పుడు ఎప్పుడూ కాదని చెప్పకూడదని, తనకు సేవ చేయటం అంటే ఇష్టమని కిమ్ కర్దాషియన్ చెప్పారు.

కిమ్ కర్దాషియన్ ఇటీవేల తన బామ్మ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని కలిశారు. డ్రగ్స్ కేసులో అరెస్టయిన తన బామ్మ అలైస్‌ మేరీ జాన్సన్‌ (63)కు క్షమాభిక్ష పెట్టాల్సిందిగా ఆమె ట్రంప్‌ను కోరారు. కిమ్ కోరికను ట్రంప్ అంగీకరించి, ఆ మేరకు అలైజ్ జాక్సన్‌ను విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం.

అలైన్ మేరీ జాన్సన్ 1996లో డ్రగ్స్‌ కేసులో అరెస్టయింది. ఈ కేసులో ఆమెకు పెరోల్‌ కూడా ఇవ్వకుండా జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. గత రెండు దశాబ్దాలుగా జాన్సన్‌ జైలు శిక్ష అనుభవిస్తున్నారని, ఆమె విషయంలో ఇకనైనా కనికరించాలని కిమ్ ట్రంప్‌ని కోరింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios