Asianet News TeluguAsianet News Telugu

కేరళ నర్స్ కి కరోనా వైరస్.... సౌదీకి కూడా పాకేసింది..

ప్రస్తుతం ఆమెకు సౌదీలోని అసీర్ నేషనల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. ట్రీట్మెంట్ పొందుతున్న బాధిత నర్సు.. ఆరోగ్యం క్రమంగా  మెరుగుపడుతున్నట్లు కేంద్ర మంత్రి గురువారం ఓ ట్వీట్ లో తెలిపారు. 

Kerala nurse in Saudi Arabia first Indian to be infected, CM writes to Centre
Author
Hyderabad, First Published Jan 24, 2020, 11:47 AM IST

చైనాలో మొదలైన కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తుంది. చైనా నుంచి ఇతర దేశాలకు కూడా పాకుతోంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా 18మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా... ఇప్పుడు ఈ వ్యాధి సౌదీ అరేబియాకూడా పాకేసింది. అక్కడ కేరళకు చెందిన ఓ నర్స్ కి ఈ వైరస్ సోకింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి మురళీధరన్ అధికారికంగా ధ్రువీకరించారు.

గురువారం సాయంత్రం మంత్రి దీనిపై ఓ వివరణ ఇచ్చారు. భారత్ లోని కేరళ రాష్ట్రానికి చెందిన దాదాపు 100మంది నర్సులు సౌదీ అరేబియాలోని ఏఎల్ హయత్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. కాగా వారిలో ఒకరిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయని ఆయన చెప్పారు.

Also Read విజృంభిస్తున్న కొరోనా వైరస్... చైనాలోని ఐదు పట్టణాలు మూసివేత...

ప్రస్తుతం ఆమెకు సౌదీలోని అసీర్ నేషనల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. ట్రీట్మెంట్ పొందుతున్న బాధిత నర్సు.. ఆరోగ్యం క్రమంగా  మెరుగుపడుతున్నట్లు కేంద్ర మంత్రి గురువారం ఓ ట్వీట్ లో తెలిపారు. 

అయితే సౌదీ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) మాత్రం ఇప్పటివరకు కరోనావైరస్ కేసులు లేవని చెబుతోంది. అసీర్ రీజియన్ సైంటిఫిక్ రీజినల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ చైర్మన్ డాక్టర్ తారిక్ అల్ అజ్రాకి మాట్లాడుతూ.... అసీర్ నేషనల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఇండియన్ నర్సుకి సోకింది ప్రస్తుతం వూహాన్ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ కాదని ఆమెకు సోకింది వేరే వైరస్ అని తెలిపారు.

కాగా..ఇటీవల చైనాలోని ఓ భారతీయ టీచర్ కి కూడా ఈ వైరస్ సోకింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇదిలా ఉండగా... ఈ వైరస్ తమ దేశాలకు పాకకుండా ఉండేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios