Asianet News TeluguAsianet News Telugu

జపాన్‌లో భూకంపం, సునామీ వార్నింగ్: భారతీయులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు


జపాన్ లో భారీ భూకంపం కారణంగా సునామీ వార్నింగ్ ఇచ్చారు. దీంతో జపాన్ లోని  భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం  కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసింది. 

Indian Embassy In Japan Issues Emergency Numbers For Citizens Amid Tsunami Scare lns
Author
First Published Jan 1, 2024, 3:51 PM IST

న్యూఢిల్లీ: జపాన్ లోని భారత రాయబార కార్యాలయం పౌరుల కోసం అత్యవసర సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.  

సోమవారం నాడు జపాన్ లో  7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా సునామీ కూడ వచ్చే అవకాశం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు  హెచ్చరికలు జారీ చేశారు.  భూకంప తీవ్రత కారణంగా  ఐదు మీటర్ల ఎత్తులో  సముద్ర అలలు ఎగిసి పడుతున్నాయి.  
జపాన్ లో భూకంపం రావడంతో  భారత రాయబార కార్యాలయం  భారతీయ పౌరుల కోసం  అత్యవసర సంప్రదింపుల కోసం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది. 

జపాన్ లోని భారత రాయబార కార్యాలయంతో  పాటు కంట్రోల్ రూమ్ కు సంబంధించి ఇచ్చిన నెంబర్లలో  సమాచారం కోసం సంప్రదించాలని  కోరింది.  

సహాయం కోసం సంప్రదించాల్సిన నెంబర్లు
+81-80-3930-1715 యాకుబ్ టోపిని)

+81-70-1492-0049 ( అజయ్ సేథీ)
+81-80-3214-4734 ( డీ.ఎన్. బర్నావాల్)
+81-80-6229-5382 (ఎస్. భట్టాచార్య)
+81-80-3214-4722 ( వివేక్ రథీ) 

ఏదైనా సమాచారం కోసం పై నెంబర్లలో సంప్రదించాలని  జపాన్ లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

ఈ ఫోన్ నెంబర్లతో పాటు "sscons.tokyo@mea.gov.in, offseco.tokyo@mea.gov.in, ఈ మెయిళ్లలో కూడ సంప్రదించవచ్చని  కూడ  భారత రాయబార కార్యాలయం తెలిపింది.

భూకంపం కారణంగా జపాన్ తీర ప్రాంత ప్రజలను  సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని  సూచించింది.గతంలో కూడ పెద్ద భూకంపాలు ఏర్పడిన విషయాన్ని స్థానిక అధికారులు గుర్తు చేస్తున్నారు. భూకంపం వాటిల్లిన ప్రాంతాల్లో  ప్రజలు కనీసం వారం రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

 

రానున్న రోజుల్లో పెద్ద భూకంపాలు వాటిల్లే అవకాశం ఉందని  శాస్త్రవేత్తలు వార్నింగ్ ఇచ్చారు.  మూడేళ్లుగా ఈ ప్రాంతంలో భూకంపాలు వరుసగా వస్తున్నాయి. భవిష్యత్తులో కూడ  భూకంపాలు వాటిల్లే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios