హోటల్ గదిలో రహస్య కెమేరాలను ఏర్పాటు చేసి కొత్తరకం స్కామ్ కి తెర లేపారు. హోటల్లో రెండు, మూడు రోజులు ఆనందంగా గడపడానికి వచ్చే జంటను ఓ ముఠా టార్గెట్ చేసి మరీ వారి రహస్య జీవితాలను వీడియోలో చిత్రీకరించింది. ఈ సంగటన దక్షిణ కొరియాలో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...    ఈజీ మనీకి అలవాటుపడిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడ్డారు. వారు పథకం ప్రకారం దేశంలోని పది నగరాల్లో  ఉన్న 30 వేర్వేరు హోటళ్లలోని 40 గదుల్లో ఈ కెమేరాలను అమర్చారు.

మిల్లీమీటరు మందంతో ఉన్న కెమెరాలను ఎవరికీ అనుమానం రాని రీతిలో టీవీ బాక్స్‌ల్లో, వాల్‌ సాకెట్లలో, హెయిర్‌ డ్రయ్యర్‌ హోల్డర్లలో అమర్చారు. ఆ వీడియోలను అన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ముఠా సభ్యులు భారీమొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు.

4వేల మందికిపైగా సభ్యులు ఉన్న ఓ వెబ్ సైట్ వాటిని ప్రత్యక్ష ప్రసారం చేసింది. వాటిని చూడటానికి సైట్ యాజమాన్యం సభ్యుల నుంచి భారీ మొత్తం వసూలు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. 

కాగా.. దక్షిణకొరియాలో తక్కువ ధరకే హోటల్స్ అద్దెకు దొరకుతాయి. దీంతో విదేశీయులతోపాటు స్థానికులు  సైతం ఇక్కడ స్టే చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఎక్కువగా ఫ్రీడమ్ కోరుకునే కాలేజీ యూత్ వీడియోలు ఎక్కువగా రికార్డు అయినట్లు తెలుస్తోంది. దీనిని ఆ ముఠా వ్యాపారంగా మలుచుకుంది.