అయోధ్య లో ప్రాణప్రతిష్ట: అమెరికాలో హిందూ అమెరికన్ల ర్యాలీ

అయోధ్యలో రామ మందిరంలో వచ్చే ఏడాది జనవరి 22న  ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో కూడ  భారతీయ హిందూవులు  సంబరాలు చేసుకుంటున్నారు.  

Hindu Americans Organise Rally in Washington to celebrate Upcoming PranPratishta At Ayodhya Ram Temple lns

వాషింగ్టన్: అయోధ్యలోని రామ మందిరంలో  వచ్చే ఏడాది జనవరి  22న ప్రాణప్రతిష్ట జరగనుంది. దీన్ని పురస్కరించుకొని  అమెరికాలోని పలు ప్రాంతాల్లో  కార్యక్రమాలు నిర్వహించారు.వాషింగ్టన్లోని  హిందూ అమెరికన్లు  మినీ కారు, బైక్ ర్యాలీ నిర్వహించారు.   

అయోధ్య వే పేరుతో  ఈ కార్యక్రమానికి పేరు పెట్టారు.  అయోధ్యలో  రామ మందిరంలో  ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో  కారు ర్యాలీ నిర్వహించారు.  అమెరికాలోని  పలు హిందూ అమెరికన్లు  కార్ల ర్యాలీ నిర్వహించారు.  10 నుండి  70 వరకు కార్లతో ర్యాలీ చేశారు. ఈ కార్ల ర్యాలీలో  పలు వయస్సుల వాళ్లు పాల్గొన్నారు.  అంతేకాదు  అమెరికాలో  నివసిస్తున్న  ఇండియాకు చెందిన పలు ప్రాంతాలకు చెందినవారు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

ఇండియాలోని  అయోధ్యలో రామమందిరానికి ప్రాణ పత్రిష్ట జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా అమెరికాలో వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో  విశ్వహిందూ పరిషత్  అధ్యక్షుడిగా  పనిచేస్తున్న మహేంద్ర సాప తెలిపారు.

అయోధ్యలో  రామ మందిరం నిర్మాణం కోసం  500 ఏళ్లుగా పోరాటం సాగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  ఎట్టకేలకు ఈ కార్యక్రమం పూర్తి కావచ్చిందన్నారు. అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ట నేపథ్యంలో  2024 జనవరి  20న చారిత్రక సంబరాలను నిర్వహించనున్నట్టుగా మహేందర్ సాప చెప్పారు. ఈ కార్యక్రమంలో సుమారు  1000 మంది హిందూ కుటుంబాలు పాల్గొంటాయన్నారు.ఈ కార్యక్రమంలో రామ్ లీల,శ్రీరామ చరిత్ర, ప్రార్ధనలు, భజనలు చేయనున్నట్టుగా మహేంద్ర తెలిపారు. 

శ్రీరాముడి జీవిత చరిత్రకు సంబంధించి 45 నిమిషాల  ఓ స్కిట్ ను  చిన్నారులు ప్రదర్శించనున్నట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కో ఆర్గనైజర్  అనిమేష్ శుక్లా చెప్పారు. 

తమిళ హిందూ లీడర్  స్వామినాథన్  తమిళంలో శ్రీరాముడిని గురించి ఓ  పాట పాడారు.  వచ్చే ఏడాది జనవరి 20న అమెరికాలో నిర్వహించే  కార్యక్రమంలో  పాల్గొనాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు, కన్నడ ప్రాంతాలకు చెందిన  వారు కూడ ప్రసంగించారు.  తమ జీవితాల్లో శ్రీరాముడి జీవితం ఎలా ప్రభావితం చేసిందో వివరించారు.  కర్ణాటక  ప్రాంతానికి చెందిన  సురేష్  శ్రీరాముడి గురించి పలు విషయాలను వివరించారు.

 అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఇంత కన్నా గొప్పగా నిర్వహించుకోవాలని కారు, బైక్ ర్యాలీ నిర్వహించిన  కృష్ణ గుడిపాటి ఆకాంక్షను వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని కోరారు.

అమెరికాలో నివాసం ఉంటున్న  అంకుర్ మిశ్రా  అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ప్రాముఖ్యత గురించి వివరించారు.  అంకుర్ పూర్వీకులు  భారత్ కు చెందినవారు.

 

2024 జనవరి  22న  అయోధ్యలో  శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ మందిర నిర్మాణాన్ని   చేపట్టనుంది.   ఈ కార్యక్రమం నేపథ్యంలో  ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు భద్రత ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios