Asianet News TeluguAsianet News Telugu

ట్రాఫికింగ్, చైల్డ్ పోర్నోగ్రఫీ, మనీ లాండరింగ్.. గర్ల్స్ డోపోర్న్ వ్యవస్థాపకుడు మైఖేల్ జేమ్స్ ప్రాట్ అరెస్టు

పోర్న్ వీడియోలను చిత్రీకరించడానికి యువతులను బలవంతం చేసిన కాలిఫోర్నియాకు చెందిన పోర్న్ సామ్రాజ్యం వ్యవస్థాపకుడు మైఖేల్ జేమ్స్ ప్రాట్ ని  స్పానిష్ నేషనల్ పోలీసులు బుధవారం మాడ్రిడ్‌లో అరెస్టు చేశారు. ఫెడరల్ సెక్స్-ట్రాఫికింగ్ ఆరోపణలను ఎదుర్కొంటూ పరారీలో ఉన్న మైఖేల్ జేమ్స్ ప్రాట్ ని మూడేళ్ల తర్వాత స్పెయిన్‌లో అరెస్టు చేసినట్లు FBI ప్రకటించింది.  

GirlsDoPorn founder Michael James Pratt arrested
Author
First Published Dec 26, 2022, 5:23 AM IST

పోర్న్ వీడియోలను చిత్రీకరించడానికి యువతులను బలవంతం చేసిన కాలిఫోర్నియాకు చెందిన పోర్న్ సామ్రాజ్యం వ్యవస్థాపకుడు మైఖేల్ జేమ్స్ ప్రాట్ ని స్పెయిన్‌లో అరెస్టు చేశారు. స్పానిష్ జాతీయ పోలీసులు బుధవారం మాడ్రిడ్‌లో అతన్ని అరెస్టు చేసినట్లు  FBI ఓ ప్రకటన విడుదల చేసింది. మైఖేల్ జేమ్స్ ప్రాట్ FBI టెన్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన ప్రాట్‌.. మహిళలపై లైంగిక వేధింపులు, అక్రమ రవాణా, మైనర్ పై లైంగిక దాడులు, చైల్డ్ పోర్నోగ్రఫీ తయారీ,మనీ లాండరింగ్ వంటి ఆరోపణలను ఎదుర్కొంటారు.

అతడు శాన్ డియాగోలో గర్ల్స్‌డోపోర్న్ అనే పోర్న్ వెబ్‌సైట్‌ను స్థాపించారు. 2019లో శాన్ డియాగోలో లైంగిక నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మోసం, ఒప్పందాన్ని ఉల్లంఘించారని 22 మంది మహిళలు సివిల్ దావా వేశారు. అదే సమయంలో కాంట్రాక్ట్‌పై సంతకం చేయడానికి ముందు తమతో బలవంతంగా మద్యం, గంజాయి తాగించారని, వాటిని చదవడానికి అనుమతించలేదని బాధిత మహిళలు పేర్కొన్నారు. కొంతమంది తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, పోర్న్ చిత్రీకరణ పూర్తయ్యే వరకు అయిష్టంగానే హోటల్ గదుల్లో ఉంచారని ఆరోపించారు. అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రాట్, మాథ్యూ ఐజాక్ వోల్ఫ్, నిర్మాత, నటుడు రూబెన్ ఆండ్రీ గార్సియాపై  US$12.7 మిలియన్ల జరిమానా విధించింది ప్రత్యేక కోర్టు.
  
వెబ్‌సైట్ లో రోజువారీ కార్యకలాపాలు, ఫైనాన్స్, మార్కెటింగ్, చిత్రీకరణను నిర్వహించే వోల్ఫ్.. తాను సెక్స్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్టు నేరాన్ని అంగీకరించాడు. ఇతర సహ నిందితులు కూడా నేరాన్ని అంగీకరించారు.నటుడు రూబెన్ గార్సియాకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. కెమెరామెన్ థియోడర్ గీకి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. గర్ల్స్ డోపోర్న్ మాజీ బుక్ కీపర్ వాలోరీ మోజర్ కూడా గతేడాది నేరాన్ని అంగీకరించారు. అతనికి కూడా జైలు శిక్ష విధించబడింది.

Follow Us:
Download App:
  • android
  • ios