మాస్కో: ఓ మేల్ సెక్స్ వర్కర్ తో హోమో సెక్స్ కు పాల్గొని అతడిని అతి దారుణంగా హతమార్చాడో సీని నటుడు. రష్యాలో సంచలనం సృష్టించిన ఈ దారుణ హత్యా కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా పరిష్కరించారు. శస్త్రచికిత్స ద్వారా వక్షోజాల పెరుగులకు ఉపయోగపడే సిలికాన్ ఇంప్లాట్స్ ఆధారంగా నిందితున్ని  పట్టుకున్నారు. 

వివరాల్లోకి వెళితే... ఇటీవల మాస్కో సమీపంలోకి మీగా నది తీరంలో ఓ సెక్స్ వర్కర్ మృతదేహాన్ని కాళ్లు, చేతులు నరికేయబడిన స్థితిలో గుర్తించారు. అయితే నిందితున్ని గుర్తించేందుకు మృతుడి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ సీరియల్ ఆదారంగా పోలీసులు దర్యాప్తు సాగించారు. దీంతో మృతుడి పేరు ఖతంజోనావ్ అని తెలిసుకున్న పోలీసులు అతడి స్నేహితులను కలుసుకుని వివరాలు సేకరించారు. 

ఈ క్రమంలోనే అతడు చివరిసారిగా యూరీ అనే కస్టమర్ తో గడపడానికి వెళ్లినట్లు వారు తెలిపారు. దీంతో పోలీసులు యూరీని  అరెస్ట్  చేసి విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అయితే నిందితుడు యూరీ సినీ నటుడే కాకుండా కొన్ని సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించినట్లు గుర్తించారు. తన ప్రాణరక్షణ కోసమే ఈ హత్య చేసినట్లు యూరీ చెబుతున్నాడు.