Asianet News TeluguAsianet News Telugu

సెక్స్ కోరికలు తగ్గించడానికి ఆడవారి హార్మోన్లు ఎక్కించారు.. ఆ దేశ మాజీ రాజుపై సంచలన ఆరోపణలు

స్పెయిన్ మాజీ రాజుపై మాజీ పోలీసు కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ రాజు జువాన్ కార్లోస్‌కు సెక్స్ కోరికలు అధికంగా ఉండేవని, వాటిని కంట్రోల్ చేయడానికి ఆయనకు ఆడవారి ఆర్మోన్లు ఎక్కించారని, అంతేకాదు, టెస్టోస్టిరాన్ నియంత్రించే మందులనూ ఇచ్చారని ఆరోపించారు. ఆయనకు ఐదు వేల మంది లవర్లు ఉన్నారని ఆ దేశ రైటర్ ఓ పుస్తకాన్ని ప్రచురించిన తరుణంలో ఈ ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.
 

female hormones injected to spain former king to control sex drive
Author
New Delhi, First Published Oct 23, 2021, 6:59 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: స్పెయిన్ దేశ మాజీ రాజు జువాన్ కార్లోస్‌పై ఓ మాజీ పోలీసు అధికారి సంచలన ఆరోపణల చేశారు. Former King జువాన్ కార్లోస్‌కు సెక్స్ కోరికలు ఎక్కువ అని, ఆ కామేచ్ఛతో దేశానికే సమస్యలు రావచ్చని భావించినట్టు పేర్కొన్నారు. అందుకే ఆయన తన కోరికలను Control చేయడానికి ఆయనకు ఆడవారి Hormones ఎక్కించినట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, టెస్టోస్టిరాన్‌నూ నియంత్రించడానికి ప్రయత్నాలు చేశారని వివరించారు. 

Spain దేశ కులీన వర్గీయులను బ్లాక్ మెయిల్ చేయాలనే కుట్ర చేశారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ పోలీసు కమిషనర్ జోస్ మేనుయల్ విల్లారెజో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో పార్లమెంటరీ కమిటీ ఆయనను దర్యాప్తు చేస్తున్నది. ఈ దర్యాప్తులో భాగంగానే విల్లారెజో మాజీ రాజు కార్లోస్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

స్పెయిన్ నేషనల్ ఇంటెలిజెన్స్ సెంటర్ మాజీ రాజు జువాన్ కార్లోస్‌కు ఆడవారి హార్మోన్లను ఎక్కించిందని విల్లారెజో తెలిపారు. ఆయన కామేచ్ఛను తగ్గించడానికి ఆడవారి హార్మోన్లతోపాటు టెస్టోస్టిరాన్ ఉధృతిని తగ్గించే మందులనూ ఎక్కించారని పేర్కొన్నారు. కార్లోస్‌కు Sex కోరికలు ఎక్కువ అని, దానితో తన పాలనకూ భంగం కలుగవచ్చనే ఆందోళనతో ఆయన ఈ పనికి ఉపక్రమించారని తెలిపారు. ఈ ట్రీట్‌మెంట్ చేయించుకుంటుండగా ఆయన రిపోర్టుల రికవరీ పనిని తనకు అప్పగించినట్టు విల్లారెజో వివరించారు.

Also Read: రెండో ప్రపంచయుద్ధంలో ఇండియాలో పాతిపెట్టిన బాంబులు.. ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి

ఇది వరకే ఓ స్పానిష్ రైటర్ మాజీ రాజు జువాన్ కార్లోస్‌పై సంచలన పుస్తకాన్ని ప్రచురించారు. అందులో జువాన్ కార్లోస్‌కు సతీమణి మినహా 5000 మంది లవర్లు ఉన్నట్టు రాశారు. ఇందులో స్వదేశంతోపాటు విదేశీ ప్రముఖులూ ఉండటం గమనార్హం. ఈ పుస్తకం ప్రచురితమైన తర్వాతే విల్లారెజో ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కులీనవర్గానికి చెందిన వారితో మాట్లాడేటప్పుడు విల్లారెజో ఆ సంభాషణను రికార్డ్ చేసేవారని, తద్వారా వాటిని ఉపయోగించి బ్లాక్ మెయిలింగ్ చేయడానికి ఆస్కారముంటుందన్న కుట్రతో ఈ పని చేశారని విల్లారెజోపై ఆరోపణలున్నాయి. అంతేకాదు, ప్రత్యర్థుల నుంచి సొమ్ము పుచ్చుకుని వారి ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో ఈ రికార్డింగ్‌లు చేసి ఉండవచ్చనే అనుమానాలున్నాయి. ఈ కేసులోనే విల్లారెజోపై దర్యాప్తు సాగుతున్నది.

Also Read: నేను అమ్మకానికి లేను.. నన్ను నేనే పెళ్లి చేసుకున్నా.. అరబ్ షేక్ ఆఫర్‌పై మాడల్ ఘాటు వ్యాఖ్యలు

1975 నుంచి 2014 వరకు స్పెయిన్ రాజుగా కొనసాగిన జువాన్ కార్లోస్ తర్వాత కొడుకును పట్టాభిషిక్తుడిని చేశారు. తర్వాత ఓ మల్టీ మిలియన్ డాలర్ల అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చిన తర్వాత జువాన్ కార్లోస్ దేశం వదిలి యూఏఈలోని అబుదాబికి పరారయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios