పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బసీత్ సోషల్ మీడియా వేదికగా అడ్డంగా బుక్కయ్యారు. పుల్వామా దాడి, జమ్మూకశ్మీర్ కి ఉన్న స్వయం ప్రతిపత్తిని తొలగించడం వంటి కారణాలతో భారత్, పాక్ మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో... భారత్ పై ఏ కారణంతో బురదజల్లాలా అని పాక్ ఎదురు చూస్తోంది. తాజాగా అలాంటి ప్రయత్నమే చేసి అడ్డంగా బుక్కయ్యింది.

పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బసీత్ సోమవారం ఓ ట్వీట్ చేశారు.పోర్న్‌ స్టార్‌ జానీ సిన్స్‌ ఫొటోతో కూడిన ట్వీట్‌ను ఆయన రీట్వీట్‌ చేస్తూ.. ‘కశ్మీర్‌లో ఎంత అరాచమో చూడండి. అనంతనాగ్‌లో యూసుఫ్‌ అనే వ్యక్తి బుల్లెట్‌ గాయాలతో కంటి చూపు కోల్పోయాడు. ఇప్పటికైనా నోరు విప్పండి. అన్యాయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లండి’అన్నారు. 

కాగా..బషీత్‌ తప్పిదాన్ని పసిగట్టిన ఆ దేశ జర్నలిస్టు నైనా ఇనాయత్‌... పాకిస్తాన్‌ మాజీ హైకమిషనర్‌ అబ్దుల్‌ బసిత్‌ పప్పులో కాలేశారు. ఆయన ట్వీట్‌ చేసింది పోర్న్‌ స్టార్‌ జానీ సిన్స్‌ ఫొటో. అసత్య ప్రచారమంటే ఇదే కావొచ్చు’అని ట్వీట్‌ చేశారు. కాగా.. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. భారతపై బురద జల్లే ప్రయత్నంలో.. ఆయనే పప్పులో కాలేశారంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.