కైరో: ఈజిప్టులో ఓ మహిళపై దారుణం చోటు చేసుకొంది. జడ్జితో పాటు ఆయన ఇద్దరు  స్నేహితులు కలిసి నాలుగు దఫాలు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  ఈ ఘటన ఈజిప్టు లో చోటు చేసుకొందని స్థానిక మీడియా తెలిపింది.

ఈజిప్ట్‌నకు చెందిన ఓ మహిళ  న్యాయం  కోసం జడ్జిని ఆశ్రయించింది. జడ్జి స్నేహితుల్లో  కాంట్రాక్టర్ గా ఉన్న ఓ వ్యక్తి రియల్ ఏస్టేట్ కు సంబంధించిన సమావేశానికి హాజరు కావాలని బాధిత మహిళకు సమాచారం పంపారు.

రియల్ ఏస్టేట్ లో పెట్టుబడి పెట్టేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మహిళను మరీనాలోని ఓ హోటల్ కు రావాలని పిలిచారు.  అయితే ఆ హోటల్ కు వచ్చిన ఆమెకు హోటల్స్ లో రూమ్ లు ఖాళీగా లేవని నమ్మించారు.

తమకు చెందిన ఓ విల్లాకు ఆమెను తీసుకెళ్లారు. విల్లాకు మహిళ చేరుకొన్న తర్వాత జడ్జితో పాటు అతని ఇద్దరు స్నేహితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇదే విల్లాలో ఆమెను బంధించి నాలుగు దఫాలు అత్యాచారం చేశారు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జడ్జితో పాటు అతని ఇద్దరు స్నేహితులపై విచారణను కోరింది.

ఈ విషయమై విచారణకు పబ్లిక్ ప్రాసిక్యూషన్  అధికారులను ఆదేశించింది.