కోవిడ్ చికిత్సలో యాంటీ వైరల్ డ్రగ్ ఐవర్ మెక్టీన్ ను ఉపయోగించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించింది. కోవిడ్ చికిత్సలో ఐవర్ మెక్టీన్ సమర్థంగా పనిచేస్తుందని, మరణ ముప్పును గణనీయంగా తగ్గిస్తుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. 

అమెరికా జర్నల్ ఆఫ్ థెరఫ్యూటిక్స్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీంతో రాష్ట్రంలో 18 యేళ్లు దాటినవారందరికీ ఐవర్ మెక్టీన్ మాత్రలను పంపిణీ చేస్తామని గోవా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. 

ఈ నేపథ్యంలో  ఐవర్ మెక్టీన్  వాడకం మీద డబ్ల్యూ హెచ్ వో చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్ చేసిన ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది.

ఆమె ఈ ట్వీట్ లో ‘ఏదైనా కొత్త వ్యాధికి వాడే మందులకు కచ్చితమైన భద్రత, సమర్థత చాలా ముఖ్యం. క్లినికల్ ట్రయల్స్ లో తప్ప కోవిడ్ చికిత్సలో  ఐవర్ మెక్టీన్ ఉపయోగించవద్దని డబ్ల్యూ హెచ్ వో సిఫారసు చేసింది’ అని సౌమ్య పేర్కొన్నారు.