Asianet News TeluguAsianet News Telugu

కొడుకును పోర్న్ వీడియోలు చూడొద్దన్న... తల్లిదండ్రులకు రూ.21లక్షల ఫైన్ వేసిన కోర్టు

తన పోర్న్ డివిడిలు తల్లిదండ్రులు ధ్వంసం చేశారని ఆ సుపుత్రుడు కోర్టును ఆశ్రయించాడు. 

destroying porn collection... Michigan man wins lawsuit against parents
Author
Michigan City, First Published Dec 20, 2020, 8:15 AM IST

మిచిగాన్: చెడు అలవాటును మాన్పించి కొడుకును మంచి మార్గంలోకి తీసుకెళ్లాలని ఆ తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. తన పోర్న్ డివిడిలు తల్లిదండ్రులు ధ్వంసం చేశారని ఆ సుపుత్రుడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు కూడా తల్లిదండ్రుల చర్యను తప్పుబడుతూ తల్లిదండ్రులకు భారీ జరిమానా విధించారు. ఈ విచిత్ర సంఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకుంది. 

మిచిగాన్ కు చెందిన డేవిడ్ తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు. డేవిడ్ పోర్న్ వీడియోలకు బానిసవడాన్ని తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు అతడి వద్ద గల పోర్న్ టేప్‌లు, డీవీడీలను ధ్వంసం చేశారు. దీంతో అతతడు తీవ్ర ఆగ్రహానికి గురయి తన తల్లిదండ్రులను కోర్టుకు ఈడ్చాడు. తన అనుమతి లేకుండా పోర్న్ కలెక్షన్ ను ధ్వసం చేసిన తల్లిదండ్రుల నుండి 29వేల డాలర్ల నష్టపరిహారం(రూ.21లక్షలు) ఇప్పించాలని కోర్టును కోరారు. 

అయితే కోర్టు డేవిడ్ ని మందలించి తల్లిదండ్రుల తరపున తీర్పునిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కోర్టు డేవిడ్ కు అనుకూలంగా సంచలన తీర్పునిచ్చింది. మైనర్ కొడుకు అనుమతి లేకుండా అతడి వస్తువులను(పోర్న్ డివిడిలను) ధ్వంసం చేయడం తల్లిదండ్రుల తప్పని...అందుకుగాను వారు అతడు కోరినట్లుగా నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. 

ఈ తీర్పుతో డేవిడ్ ఆనందం వ్యక్తం చేస్తుండగా తల్లిదండ్రులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పోర్న్‌కు సంబంధించిన 400కు పైగా వీహెచ్‌ఎస్ టేప్‌లు, 1600కు పైగా డీవీడీలు ధ్వంసం చేశారట. ఇలా కొడుకును సంస్కరించాలని ప్రయత్నించి తల్లిదండ్రులే కోర్టు ముందు దోషులుగా మారారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios