Deltacron variant : మరో కొత్త వైరస్ డెల్టాక్రాన్.. ఈ వేరియంట్ వ్యాప్తి ఎలా ఉంటుందో?
Deltacron variant : ప్రపంచవ్యాప్తంగా ఓ వైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ విజృంభన దాటికి అగ్రదేశాలు సైతం చిగురుటాకుల వణికిపోతున్నాయి. ఈ తరుణంలో మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. అదే డెల్టాక్రాన్. సైప్రస్ విశ్వవిద్యాలయంలో బయోలాజికల్ సైన్సెస్ ప్రొఫెసర్, బయోటెక్నాలజీ అండ్ మాలిక్యులర్ వైరాలజీ లాబొరేటరీ హెడ్ లియోండియోస్ కోస్ట్రికిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే రోగి ప్రస్తుతం నమోదవుతున్న డెల్టా, ఒమిక్రాన్ లక్షణాలను గుర్తించామని అన్నారు.
Deltacron variant : ప్రపంచవ్యాప్తంగా ఓ వైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్స్ విజృంభిస్తున్నాయి. ఈ వైరస్‌ల దాటికి అగ్రదేశాలు సైతం చిగురుటాకుల వణికిపోతున్నాయి. లక్షలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరుణంలోసైప్రస్లో కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. డెల్టా, ఒమిక్రాన్ జన్యువుల కలయికతో డెల్టాక్రాన్ అనే కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది.
డెల్టా, ఒమిక్రాన్ జన్యువుల కలయికతో డెల్టాక్రాన్ అనే కొత్త వేరియంట్.. ఉద్బవించిందని సైప్రస్ విశ్వ విద్యాలయంలోని బయోలాజికల్ సైన్సెస్ ప్రొఫెసర్, బయోటెక్నాలజీ అండ్ మాలిక్యులర్ వైరాలజీ లాబొరేటరీ అధిపతి లియోండియోస్ కోస్ట్రికిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఒకే వ్యక్తిలో డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్ లక్షణాలు కనిపిస్తోన్నాయని తెలిపారు. ఈ కొత్త కోవిడ్-19 జాతికి 'డెల్టాక్రాన్' పేరు కూడా పెట్టామని తెలిపారు.
రెండు వేరియంట్ లక్షణాలు ఉన్న 25 కేసులు గుర్తించామని, సేకరించిన 25 నమూనాల్లో పది ఒమిక్రాన్ మ్యుటేషన్లు కనిపించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఓమిక్రాన్, డెల్టా కో-ఇన్‌ఫెక్షన్‌లు ఉన్నాయి. ఈ రెండింటి కలయికతో కూడిన ఈ జాతిని కనుగొన్నామని కోస్ట్రికిస్ చెప్పారు. కరోనాతో ఆస్పత్రిలో చేరినవారిలోనే ఈ లక్షణాలు ఎక్కువగా గుర్తించినట్టు తెలిపారు. 25 డెల్టాక్రాన్ కేసుల నమూనాల్లో ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితుల నుంచి 11 నమూనాలు, సాధారణ పౌరుల నుంచి 14 నమూనాలు పరీక్షించినట్లు తెలిపారు. సీక్వెన్సుల వివరాలను అంతర్జాతీయ డేటాబేస్ అయిన GISAIDకి పంపిచామని అన్నారు.
ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి గురించి ఇప్పుడే ఏం చెప్పలేం అని.. దీనిపై ఇంక పరిశోధనలు చేయవల్సిన అవసరముందనీ, ఈ వేరియంట్ మరింత వ్యాధికారకమైనదా ? మరింత అంటువ్యాధిగా ఉందా ? లేదా డెల్టా మరియు ఓమిక్రాన్‌ల కంటే ఇది ప్రబలంగా ఉంటుందా? అనేది భవిష్యత్తులో మనం చూస్తామని డాక్టర్ కోస్ట్రికిస్ చెప్పారు. సుధీర్ఘ అధ్యాయనాల తరువాతే.. ఈ వేరియంట్ పై ఓ అవగాహనకు వస్తామని చెప్పారు.
కానీ, ప్రాథమిక పరిశోధనల ప్రకారం.. ప్రస్తుతానికి దీని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్య నిపుణులు తెలిపారు. ఆసుపత్రిలో చేరిన రోగులలో మ్యుటేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉందని డాక్టర్ కోస్ట్రికిస్ చెప్పారు. అయితే, కోస్ట్రికిస్ తన వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని చెబుతూ.. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ కొత్త లక్షణాలు వెలుగు చూసే అవకాశం ఉందని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో బ్రిటన్ మరో విషాదకర మైలురాయిని చేరుకుంది. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య లక్షా 50 వేలు దాటింది. ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, మాస్కులు తప్పని సరి చేసినట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
ఇటు భారత్ లోనూ ఈ వైరస్ ప్రభావం భయంకరంగా ఉంది. గడిచిన 25 గంటల్లో లక్షా 60వేల కరోనా కేసులు వెలుగు చూడగా.. ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా బయటపడ్డాయి. దేశంలో 3,623మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఇప్పటివరకు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ మహమ్మారి వ్యాపించింది. ప్రస్తుతం పలు దేశాలు కరోనా ఆంక్షలను అమలు చేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు, సినిమా థియేటర్లు, స్టేడియాలకు వచ్చేవారు వ్యాక్సినేషన్ కార్డు తప్పనిసరిగా చూపించాలనే నిబంధన తీసుకొచ్చింది.