20 నిమిషాల్లో 90శాతం సామర్థ్యాన్ని తగ్గుతోంది.. యూనివర్శిటీ ఆఫ్ బ్రిస్టల్ అధ్యయనంలో వెల్లడి
COVID-19: కరోనా వైరస్ గాలిలో ఐదు నిమిషాల పాటు గాలిలో ఉంటే.. ప్రజలకు సోకే సామర్థ్యం తగ్గిపోతుందని, అలాగే.. గాలిలో 20 నిమిషాలుంటే.. వైరస్ 90 శాతం ఇన్ఫెక్టివిటీని కోల్పోతుందని తాజా అధ్యయనంలో తేలింది.
COVID-19: ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron Varient) భారత్ లోనూ కలవరం రేపుతోంది. శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకూ దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కు చేరుకుంది. ఇదే తరుణంలో 2, 162 మంది వేరియంట్ నుంచి కోలుకున్నారు. భారత్ లో అత్యధికంగా మహారాష్ట్రలో 1367 కేసులు నమోదుకాగా.. రాజస్థాన్‌లో 792, ఢిల్లీలో 549 కేసులు నమోదయ్యాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగానే ఉంది. తెలంగాణలో 260, ఏపీలో 61 ఒమిక్రాన్ కేసులు నిర్థారణ అయ్యాయి.
ఈ వేరియంట్ ను కట్టడి కోసం ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తోన్నారు. ఈ క్రమంలో కొత్త వేరియంట్ గురించి ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి. తాజాగా.. యూనివర్శిటీ ఆఫ్ బ్రిస్టల్ అధ్యయనం కూడా సంచలన విషయాలను బయటపెట్టింది. కరోనా వైరస్ గాలిలో 20 నిమిషాలు ఉంటే. వైరస్ తన సామర్థ్యాన్ని 90% కోల్పోతోందని తాజా అధ్యయనంలో తేలింది.
ఫిజికల్ డిస్టెన్స్, మాస్క్ ధరించడం. వంటి నియమాలను పాటించడం వల్ల ఈ వేరియంట్ ను నియంత్రించవచ్చునని, తప్పని సరిగా మాస్కులు ధరించాలని, అత్యంత ప్రభావవంతమైన సాధనంగా అధ్యయనం చెబుతోంది. సరిగా వెంటిలేషన్ లేని ప్రదేశాల్లో ఉంటే.. గాలిలో కాస్త ఎక్కువ సేపు ఉండే కరోనా సోకే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనం తెలిపింది. పరిసర ఉష్ణోగ్రత, తేమ, UV కాంతి తీవ్రతను నియంత్రిస్తూ, చిన్న వైరస్-కలిగిన కణాలను ఉత్పత్తి చేసే ఉపకరణాన్ని అభివృద్ధి చేశారు. వాటిని ఐదు సెకన్ల నుండి 20 నిమిషాల మధ్య రెండు ఎలక్ట్రిక్ రింగుల మధ్య సున్నితంగా ఉంచారు.
తాజా అధ్యయనం ప్రకారం.. వైరల్ కణాలు ఊపిరితిత్తుల యొక్క సాపేక్షంగా తేమ, కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉంటే పరిస్థితులను దాటినప్పుడు వైరస్ వ్యాప్తి తగ్గువగా ఉంటాయని కనుగొన్నారు. కార్బన్ డయాక్సైడ్ క్షీణత రేటు పరిసర గాలి యొక్క సాపేక్ష ఆర్ద్రతపై ఆధారపడి ఉంటుంది. వాతావరణంలో తేమ 50 శాతం కంటే తక్కువగా ఉంటే.. వైరస్ ఐదు సెకన్లలో దాని ఇన్ఫెక్టివిటీలో సగభాగాన్ని కోల్పోయింది. తరువాతి ఐదు నిమిషాల్లో మరో 19 శాతం సామర్థం కోల్పోతుంది. వైరస్ ఐదు నిమిషాల తర్వాత 52 శాతం ఇన్ఫెక్టివిటీని కోల్పోయింది. 20 నిమిషాలు గాలిలో ఉంటే.. కరోనా వైరస్ 90 శాతం సామర్థ్యం కోల్పోతుందని తెలింది.
కరోనా వ్యాప్తి కట్టడికి భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించడం, దూరాన్ని పాటించడం వల్ల కొవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చన్నారు. తన నివాసించే ప్రాంతాల్లో సరైనా వెంటిలేషన్ ఉండాలని, ప్రజలు దగ్గరగా ఉంటే కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగానే ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఓమిక్రాన్‌పై దక్షిణాఫ్రికాలో నిర్వహించిన పరిశోధనలు కీలక అంశాలను వెల్లడించాయి. మిగిలిన వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌లో లక్షణాలు చాలా మందిలో కనిపించడం లేదని పరిశోధనలు తెలుపుతున్నాయి. వారు వాహకులుగా మారి వ్యాప్తిని మరింత వ్యాప్తి చేస్తున్నారని వెల్లడైంది.