Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్.. షాపింగ్ మాల్ లో దూరి సరుకులు నాకి..

కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళ కిరాణ సరుకులు కొనేందుకు సూపర్ మార్కెట్ కి వెళ్లింది. అక్కడ తనకు కావాల్సిన సరుకులన్నింటినీ తీసుకొని కార్ట్ లో వేసుకుంది.

Coronavirus: California Woman Arrested For Licking $1,800 Worth Groceries
Author
Hyderabad, First Published Apr 9, 2020, 10:34 AM IST

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఓ వైపు దేశాధినేతలంతా వైరస్ ని తమ దేశం నుంచి ఎలా తరిమికొట్టాలా అని తంటాలు పడుతుంటే.. మరికొందరు చెత్త చెత్త పనులు చేస్తూ.. తలనొప్పులు తెస్తున్నారు.

Also Read అమెరికాలో కరోనా పంజా..11మంది ఎన్ఆర్ఐలు మృతి, మరో 16మంది.....

ఈ వైరస్ మొదట చైనాలో మొదలైన సంగతి తెలిసిందే. అయితే అక్కడ కూడా కొందరు కరోనా సోకిన రోగులు ఇతరులపై ఉమ్మి వేయడం లాంటివి చేశారు. తాజాగా.. భారత్ లో క్వారంటైన్ కేంద్రంలో కి మూత్రం బాటిళ్లు విసిరారు. కాగా.. ఇలాంటి సంఘటనే ఇప్పుడు కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళ కిరాణ సరుకులు కొనేందుకు సూపర్ మార్కెట్ కి వెళ్లింది. అక్కడ తనకు కావాల్సిన సరుకులన్నింటినీ తీసుకొని కార్ట్ లో వేసుకుంది.

దాదాపు రూ.లక్షన్నర విలువచేసే సరుకులను ఆమె కార్ట్ లో వేసుకుంది. తర్వాత వాటన్నింటినీ నాకడం మొదలుపెట్టింది. కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తిస్తున్న సమయంలో సదరు మహిళ చేసిన పని చూసి అందరూ షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

డబ్బులు కట్టకుండా ఆ సరుకులను కాజేసేందుకు సదరు మహిళ అలాంటి ప్లాన్ వేయడం గమనార్హం. అయితే... పోలీసులు సదరు మహిళను అరెస్టు చేశారు. ఆమె నాకిన వస్తువుల్లో కొన్ని విలువైన వస్తువులు కూడా ఉన్నాయని అధికారులు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios