షికాగో సెక్స్ రాకెట్: పది మంది హీరోయిన్లు, తీగ లాగితే..

Chicago sex rocket: How it was revealed?
Highlights

షికాగో సెక్స్ రాకెట్ కేసు పలు మలుపులు తిరుగుతోంది.

షికాగో: షికాగో సెక్స్ రాకెట్ కేసు పలు మలుపులు తిరుగుతోంది. అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ నిర్వహిస్తున్న దర్యాప్తులో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో అమెరికా పోలీసులు స్థానిక కోర్డులో 40 పేజీల అఫిడవిట్ ను దాఖలు చేశారు. ఆ అఫిడవిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఈ అఫిడవిట్ లో అమెరికా దర్యాప్తు అధికారులు ఎ,బి,సి,డీ,ఈ అనే సంకేతాలతో కొందరి పేర్లను సూచించారు. వారు ఎవరై ఉంటారా అనే చర్చ సాగుతోంది. వీరితో పాటు పది మంది హీరోయిన్ల జాబితా కూడా వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురికి ఈ రాకెట్ తో సంబంధం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. 

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) అధ్యక్షుడు వేమన సతీష్ ను అమెరికా పోలీసులు పలు దఫాలు విచారించారు. తానాకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎంపీ పేరు, పలువురు రాజకీయ నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఇందులో ఏ మేరకు నిజం ఉందనేది తెలియడం లేదు.

డబ్బు ఎరగా చూపి సనీతారలతో వ్యభిచారం చేయిస్తున్న కిషన్ మోదుగుమూడి, చంద్ర కళ అనే దంపతులను షికాగో ఫెడరల్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భారతీయ సంఘాల కార్యక్రమాల్లో పాల్గొనడానికంటూ సినీ తారలకు వీసాలు ఇప్పించి అమెరికాకు రప్పిస్తారని విచారణలో తేలింది. 

విచిత్రంగా ఈ రాకెట్ వ్యవహారం వెలుగు చూసింది. నిరుడు నవంబర్ 20వ తేీదన ఓ హీరోయిన్ ఢిల్లీ నుంచి షికాగో వచ్చింది. తెలుగు ఆసోసియేషన్ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా నవంబర్ 18వ తేదీన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొనాల్సి ఉండింది. అయితే, ఆమె రెండు రోజులు ఆలస్యంగా వచ్చి కాలిఫోర్నియాకు కాకుండా షికాగోకు వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను విచారించారు. 

తాను మరో కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆమె తెలిపింది. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పింది. అయితే ఆమె ఆ కార్యక్రమంలో పాల్గొనలేదని పోలీసులు దర్యాప్తులో తేలింది. 

దాంతో ఆమెను అమెరికాకు రప్పించిన వ్యక్తి గురించి వాకబు చేశారు. ఆ వ్యక్తి పేరు రాజు అని ఉంది. అతని గురించి విచారణ సాగించారు. అయితే కిషన్ అనే వ్యక్తే రాజు అనే మారుపేరుతో ఆమెను రప్పించాడని తేలింది. దీంతో ఆ నటి వీసాను రద్దు చేశారు. మరో నలుగురు నటీమణులను కూడా విచారించారు. 

వివిధ సంఘాల ప్రతినిధులను పోలీసులు విచారించారు. గత కొన్నేళ్లుగా వివిధ సంఘాల కార్యక్రమాలకు హాజరైనవారి వివరాలను భారతదేశంలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాల నుంచి తెప్పించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు టాప్ హీరోయిన్లకు కూడా ఈ సెక్స్ రాకెట్ తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. పోలీసుల చేతికి చిక్కిన కిషన్, ఆయన భార్య చంద్రకళ ఆ హీరోయిన్లతో మాట్లాడినట్లు ఆధారాలున్నాయని చెబుతున్నారు.

కాగా, సినీ తారల వ్యభిచారం కేసుకు అమెరికాలోని తెలుగు సంఘాల ఆర్గనైజర్లకు సంబంధాలున్నాయని వస్తున్న వార్తలను తానా అధ్యక్షుడు సతీష్ వేమన ఖండించారు. నిందితులతో తానాకు ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఈ కేసులో నిందితులు పత్రాలను ఫోర్జరీ చేసి, నకిలీ ఆహ్వాన పత్రికలు సృష్టించినట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. కొన్నింటిలో తానా పేరను కూడా వాడి అక్రమంగా వీసాలు పొందారని ఆయన అన్నారు. 

loader