షికాగో: షికాగోలో అత్యంత రహస్యంగా కిషన్ దంపతులు సెక్స్ రాకెట్ ను నడిపించేవాళ్లని తెలుస్తోంది. తెలుగువాళ్లు లేని ఓ అపార్టుమెంటులో రెండు ఫ్లాట్లను తీసుకుని అందులోనే సినీ తారలను ఉంచేవాడని చెబుతున్నారు. 

ఆ ఫ్లాట్లలో దిగినవాళ్లు ఇతరులతో మాట్లాడేవారు కాదని, వారెందుకు వచ్చారో తెలిసేది కాదని అంటున్నారు. హోటళ్లలో కాకుండా ఫ్లాట్లలో వారిని ఉంచడం వల్ల విషయం వెలుగు చూడదని కిషన్ దంపతులు భావించినట్లు చెబుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కిషన్ ఆ జాగ్రత్త తీసుకున్నట్లు చెబుతున్నారు.  

కిషన్ మెయిల్స్ ను, ఫోన్ మెసేజ్ లను దర్యాప్తు అధికారులు గుర్తించారు. కిషన్ ఇంట్లో సెక్స్ రాకెట్ కు సంబంధించి కీలకమైన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. అమెరికాకు రావాలనుకునేవారికి సెక్స్ రాకెట్ పెద్ద ఇబ్బందిగా మారింది. అమెరికా పోలీసులు సెలబ్రిటీలపై ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశారు. 

సెక్స్ రాకెట్ కంపు తెలుగు సంఘాల ప్రతినిధులకు కూడా చుట్టుకుంది. వారిని కూడా దర్యాప్తు అధికారులు అనుమానించే పరిస్థితి వచ్చింది. త్వరలో జరిగే ఓ తెలుగు సంఘం వేడుకలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సెక్స్ రాకెట్ కారణంగా అమెరికాకు రావడానికి తెలుగు సెలబ్రిటీలు ఇష్టపడడం లేదు.