కాన్‌బెర్రా: అస్ట్రేలియా రక్షణ మంత్రి రెనాల్డ్ ఆఫీస్ లో తనపై అత్యాచారం జరిగిందని ఓ మహిళ ప్రకటించింది. ఈ విషయమై బాధిత మహిళకు అస్ట్రేలియా ప్రదాని స్కాట్ మారిసన్ క్షమాపణలు చెప్పారు.2019 మార్చి మాసంలో పార్లమెంట్ లోని అస్ట్రేలియా రక్షణ మంత్రి లిండా రెనాల్డ్ కార్యాలయంలో తనపై అత్యాచారం జరిగిందని  ఇటీవల స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించింది.

ఈ విషయమై తాను 2019 ఏప్రిల్ మాసంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఆమె తెలిపింది. అయితే తన కెరీర్ ను దెబ్బతీస్తారనే భయంతో అధికారికంగా ఫిర్యాదు చేయలేదని ఆమె వివరించారు.రెనాల్డ్ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి సమావేశానికి పిలిచి తనను రేప్ చేశారని ఆమె తెలిపారు. ఈ విషయమై అస్ట్రేలియా రక్షణ మంత్రి రెనాల్డ్ కూడా స్పందించారు.

అత్యాచారంపై పోలీసులకు చెప్పిన మాట వాస్తవమేనని మంత్రి ధృవీకరించారు.ఈ విషయం మీడియాలో రావడంతో ప్రధాని స్కాట్ మారిసన్ స్పందించారు. బాధిత మహిళకు పార్లమెంట్ వేదికగా ఆయన క్షమాపణలు చెప్పారు. పని చేస్తున్న ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.ఈ ఘటనపై తప్పకుండా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొంటామని ఆయన హామీ ఇచ్చారు.