Asianet News TeluguAsianet News Telugu

రియల్ లైఫ్‌లో ‘‘పా’’ : 8 ఏళ్లకే 80 ఏళ్ల బామ్మలా.. అరుదైన వ్యాధితో కన్నుమూసిన చిన్నారి

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ నటించిన ‘‘పా’’ సినిమాలో ఆయన చిన్న వయసులోనే వృద్ధుడిగా కనిపించే ‘‘ప్రొజీరియా’’ అనే అరుదైన వ్యాధితో బాధపడే వ్యక్తిగా నటించారు. ఇప్పుడు అచ్చం ఆ సినిమాలో లాగే ఓ చిన్నారి బాధపడుతూ కన్నుమూసింది.

8 years old girl died with progeria in ukraine
Author
Ukraine, First Published Feb 19, 2020, 5:04 PM IST

ప్రపంచంలో అప్పుడప్పుడు మన ఊహాకు కూడా అందని వింత జబ్బులు వస్తూ ఉంటాయి. అవి చూసినప్పుడు ఇలాంటివి కూడా అని ముక్కున వేలేసుకుంటూ ఉంటాం. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ నటించిన ‘‘పా’’ సినిమాలో ఆయన చిన్న వయసులోనే వృద్ధుడిగా కనిపించే ‘‘ప్రొజీరియా’’ అనే అరుదైన వ్యాధితో బాధపడే వ్యక్తిగా నటించారు. ఇప్పుడు అచ్చం ఆ సినిమాలో లాగే ఓ చిన్నారి బాధపడుతూ కన్నుమూసింది.

ఉక్రెయిన్‌కు చెందిన అన్నా సకిడన్‌ అనే పాపకు గత నెలలోనే 8 ఏళ్లు నిండాయి. అయితే ఆమె చిన్నప్పుడే హచిసన్ గిల్ఫోర్డ్ ప్రొజీరియా సిండ్రోమ్ అనే జబ్బు బారిన పడింది. మూడేళ్లు వచ్చే సరికే ఆ మహమ్మారి ఆమెను పూర్తిగా కబళించింది.

Also Read:సుడిగాడు: చావును నెత్తిమీద పెట్టుకుని.. 11 కిలోమీటర్ల ప్రయాణం

అప్పుడప్పుడే పెద్దగా అవుతున్న చిన్నారిని ముసలితనం ఆవహించింది. ఎంతమంది డాక్టర్లకు చూపించినా ప్రయోజనం లేకపోయింది. ఎనిమిదేళ్ల వయసులోనే 80 ఏళ్ల బామ్మలా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు ఆవేదన వర్ణనాతీతం.

సాధారణంగా ఈ వ్యాధితో బాధపడేవారికి ఒక్క సంవత్సరం 10 పదేళ్లతో సమానమని వైద్యులు చెబుతున్నారు. జన్యు సమస్యల కారణంగా అన్నా ఎముకలు స్లోగా ఎదిగాయని గుండె, కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులు మాత్రం వేగంగా వృద్ధాప్యం బారినపడ్డాయని చెప్పారు.

దీని కారణంగా అంత చిన్న వయసులోనే సకిడన్‌కు ఎన్నోసార్లు గుండెపోటు వచ్చిందని.. పెరాలిసిస్ వచ్చి కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయని ఆ తర్వాత ఆమె పరిస్ధితి మరింత క్షీణించి చివరికి చిన్నారి మరణించిందని వైద్యులు వెల్లడించారు.

హచిసన్ గిల్బోర్డ్ ప్రొజీరియా సిండ్రోమ్‌ను షార్ట్ కట్‌లో ప్రొజీరియా అని పిలుస్తారు. చిన్నారులను వృద్ధులుగా మార్చి చివరికి వారి ప్రాణాలను బలి తీసుకునే ఈ జెనెటిక్ వ్యాధి చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ జబ్బు వున్న పిల్లలు 13 ఏళ్లకు మించి బతకరు.

ప్రతి 40 లక్షల మంది పిల్లల్లో ఒకరికి ఈ వ్యాధి ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. గణాంకాలను బట్టి ప్రపంచంలో సుమారు 160 మంది పిల్లలు ప్రొజీరియాతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:పెంపుడు కుక్క తుంటరి పని: ఎంగేజ్‌మెంట్ రింగ్ తినేసింది

శరీరంలోని ఒక జీన్‌లో జరిగే ఓ చిన్న తప్పు వల్ల ఒక అసాధారణ ప్రోటీన్ పుడుతుంది. దీని పేరే ప్రొజీరిన్. మానవ శరీరంలోని కణాలు దీనిని వాడుకుని సులభంగా బ్రేక్ డౌన్ అయిపోతాయి. దీంతో అన్ని కణాల్లో ఆ ప్రోటీన్లు పేరుకుపోతాయి. దీని ప్రభావం శరీరంలోని అన్ని అవయవాలపైనే పడుతుంది.

తద్వారా వాటి వయసు అయిపోతోంది. శరీరంలో పెరుగుదల లేకపోయినా, వాటి వయసు అయిపోవడం వల్ల శరీర క్రియ మందగిస్తుంది. దీంతో స్ట్రోక్స్ వచ్చి చిన్నారులు మరణిస్తారు. చాలామందిలో గుండె పోటు సంభవిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios