Asianet News TeluguAsianet News Telugu

చిన్న గొడవ.. పెళ్లి మండపంపై గ్రెనేడ్ దాడి..ఏడుగురు మృతి

ఓవైపు పెళ్లి జరుగుతుండగానే.. మరో వైపు పెళ్లికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు. వధూవరులు, ఇతర అతిథులు చూస్తుండగానే ఆ గొడవ పెరిగి పెద్దదైంది. దీంతో గొడవపడుతున్న ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు. ఇంతలో వీరిలో ఓ వ్యక్తి తన వద్ద ఉన్న గ్రెనేడ్ తీసి ఎదుటి వ్యక్తిపైకి విసిరాడు.

7 killed after guest throws grenade at wedding party in Sudan
Author
Hyderabad, First Published Jan 21, 2020, 3:14 PM IST


పెళ్లికి వచ్చామా... వధూవరులను ఆశీర్వదించామా.. భోజనం చేసి వెళ్లిపోయామా అన్నట్లు ఉండకుండా ఓ వ్యక్తి నానా హంగామా చేశాడు. ఓ వ్యక్తితో గొడవ పెట్టుకొని నానా రభస చేసిందే కాక... మండపంపై గ్రెనేడ్ తో దాడి చేశాడు. ఈ దాడిలో దాదాపు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉండటం గమనార్హం. ఈ సంఘటన సూడాన్ లో చోటుచేసుకుంది.

Also Read ఈతరం ఇల్లాలు... భర్తను మరో మహిళకు అమ్మేసి ఆ డబ్బుతో....

పూర్తి వివరాల్లోకి వెళితే... సూడాన్ రాజధాని ఖార్తూమ్ లో సోమవారం ఓ పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లికి చాలా మంది అతిథులు హాజరయ్యారు. ఓవైపు పెళ్లి జరుగుతుండగానే.. మరో వైపు పెళ్లికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు. వధూవరులు, ఇతర అతిథులు చూస్తుండగానే ఆ గొడవ పెరిగి పెద్దదైంది. దీంతో గొడవపడుతున్న ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు. ఇంతలో వీరిలో ఓ వ్యక్తి తన వద్ద ఉన్న గ్రెనేడ్ తీసి ఎదుటి వ్యక్తిపైకి విసిరాడు.

అది కాస్త పేద్ద శబ్దంతో పేలింది. తీరా చూస్తే... ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 25మంది తీవ్రంగా గాయపడ్డారు. పచ్చని పెళ్లి మండపం మొత్తాన్ని నెత్తుటి మయం చేసేశారు.  పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా మిగిలిన అతిథులు, వధూవరులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై సూడాన్ ఆరోగ్యశాఖ స్పందించింది. విచారణ జరిపిస్తున్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు.  

Follow Us:
Download App:
  • android
  • ios