ట్రంప్ 'జీరో టోలరెన్స్'కి 52 మంది భారతీయులు బలి!

First Published 20, Jun 2018, 11:00 AM IST
52 Indians among asylum seekers detained in Oregon under Trump’s zero tolerance pol
Highlights

ట్రంప్ ఉక్కు పాదం క్రింద నలిగిపోతున్న వారిలో మన భారతీయులు కూడా ఉన్నారట. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 52 మంది భారతీయులు ఓరేగాన్‌లోని ఫెడరల్ జైలులో బందీలుగా ఉన్నారని సమాచారం.

అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ఉక్కు పాదాన్ని మోపుతున్న సంగతి మనందరికీ తెలిసినదే. అయితే, ట్రంప్ ఉక్కు పాదం క్రింద నలిగిపోతున్న వారిలో మన భారతీయులు కూడా ఉన్నారట. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 52 మంది భారతీయులు ఓరేగాన్‌లోని ఫెడరల్ జైలులో బందీలుగా ఉన్నారని సమాచారం.

అక్రమ వలసకుగాను (ఇల్లీగల్ ఇమిగ్రేషన్‌కు) వ్యతిరేకంగా ట్రంప్ అధిష్టానం వ్యవహరిస్తున్న 'జీరో టోలెరన్స్'లో భాగంగా అరెస్టయి జైలులో మగ్గుతున్న వారిలో 52 మంది భారతీయులు ఉన్నట్లు ఏషియా-పసిఫిక్ అమెరికన్ నెట్‌వర్క్ ఆఫ్ ఓరేగాన్ పేర్కొంది. 

గత నెలలో అమెరికాలో ఆశ్రయం కోరిన 123 మంది ఇమిగ్రెంట్స్‌ను అక్కడి అధికాలు అరెస్టు చేసి యామ్‌హిల్ కౌంటీలో ఉన్న ఓరెగాన్ షెరిడాన్ ఫెడరల్ జైలుకు బదిలీ చేశారు. వీరిలో ఎక్కువ మంది దక్షిణ ఆసియాకు చెందిన వారుగా గుర్తించారు. వీరిలో చాలా వరకూ హిందీ, పంజాబీ మాట్లాడుతున్నారు.

గడచిన రెండు నెలల వ్యవధిలోనే వేలాది మందికి పైగా వలసదారులను ట్రంప్ సర్కారు తమ దేశం నుంచి తరిమికొట్టింది. దొరికిన వారిని దొరికినట్లుగా అరెస్టు చేసి సరిహద్దు జైళ్లలో ఉంచింది. తమ కుటుంబాల నుంచి వారిని వేరు చేస్తున్నారు. వందలాది మంది పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

loader