హైదరాబాద్: మజ్లీస్ పార్టీ అధ్యక్షులు, ఎంపీ అసదుద్దిన్ ఓవైసి మరోసారి ట్విట్టర్ వేధికన పోలీసులపై విరుచుకుపడ్డారు. కేవలం పాతబస్తీ ప్రాంతంలోనే భారీగా పోలీస్ బలగాలను మొహరిస్తూ పోలీస్ శాఖ చేసిన ట్వీట్ పై ఓవైసీ సీరియస్ గా స్పందించారు. కేవలం చార్మినార్ వద్దే బలగాలను మొహరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. 

నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బలగాలను  మొహరించారు. ఈ క్రమంలోనే పాతబస్తీలోని చార్మినార్ వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో ప్లాగ్ మార్చ్ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను హైదరాబాద్  సిటీ పోలీస్ పేరుతో వున్న ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 

దీనిపైనే ఎంపీ అసదుద్దిన్ స్పందించారు. '' కేవలం చార్మినార్ వద్దే ఎందుకు..? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, హైటెక్ సిటీ  లేదంటే అమెరికాకు చెందిన సాప్ట్‌వేర్ కంపనీల ముందు ఎందుకు కాదు...?'' అంటూ ఓవైసి ప్రశ్నించారు. 

read more  మరోసారి ఢిల్లీలో "గోలీ మారో" కలకలం... 6గురి అరెస్ట్

పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో దేశ రాజధాని డిల్లీ అట్టుడుకుతోంది. ఇప్పటి వరకు డిల్లీ అల్లర్లలో మరణించిన వారి సంఖ్య 42కి చేరింది. కర్ఫ్యూ, 144 సెక్షన్లతో పాటు భారీగా పోలీసులు మోహరించడంతో అల్లర్లు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా కాలిపోయిన వాహనాలు, ఇటుకలు, రాళ్లు, కూల్‌డ్రింక్‌ సీసాలే కనిపిస్తున్నాయి. సాధారణ పరిస్ధితులు నెలకొంటున్న నేపథ్యంలో పోలీస్ బందోబస్తు సాయంతో మున్సిపల్ అధికారులు క్లీనింగ్ పనులు చేపట్టారు.

 ఘర్షణల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు కవాతును నిర్వహించారు. అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 106 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, 18 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీలో చెలరేగిన హింసపై పెద్ద యెత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసు కమిషనర్ గా శ్రీవాస్తవ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. అమూల్య స్థానంలో ఆయన కొత్త పోలీసు బాస్ గా వస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయన ఢిల్లీ పోలీసు కమిషనర్ గా పనిచేస్తారు.

read more  ముస్లింల కోసం ఉద్ధవ్ సర్కార్ సంచలన నిర్ణయం

డిల్లీలో సీఎఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన హింస హైదరాబాద్ కు పాకకుండా రాష్ట్ర పోలీసులు ముందస్తుగా భారీ బలగాలను మొహరించారు. అయితే ఈ బలగాలను నగరమంతటా కాకుండా కేవలం మైనారీలు అత్యధికంగా నివాసముండే పాతబస్తీ ప్రాంతంలో మొహరించడాన్ని అసదుద్దిన్ తప్పుబట్టారు.