హైదరాబాద్: ఓ మహిళ నడుపుతున్న ఆన్ లైన్ సెక్స్ రాకెట్ గుట్టును హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. అవని వెల్ నెస్ సెంటర్ పేరుతో శైలజ అనే మహిళ వేశ్యాగృహాన్ని నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తమకు అందిన సమాచారం మేరకు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసులకు చిక్కినవారిలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. భర్త పరమేశ్వర్ తో కలిసి శైలజ ఆన్ లైన్ సెక్స్ బిజినెస్ ను నడిపిస్తోంది. ఉత్తర భారతదేశం నుంచి యువతులను రప్పించి ఆమె వేశ్యావృత్తి చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

వెల్ నెస్ సెంటర్ పేరుతో యుతులను ఆకర్షించి ముగ్గులోకి దించుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు.  కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వేళ ఇటువంటి వ్యాపారాలు జరగడాన్ని ఇతర ప్రాంతాల్లో కూడా పోలీసులు గుర్తించారు. ఆ మధ్యకాలంలో వనస్థలిపురంలో ఇటువంటి కార్యకలాపాలే బయటపడ్డాయి.