హైదరాబాదు: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు శివారులోని రాజేంద్రనగర్ లో దారుణం చోటు చేసుకుంది. దుస్తులిప్పేసి నగ్నం నాట్యం చేయాలని నలుగురు యువకులు ఓ మహిళపై దాడి చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ ఈవెంట్ ఆర్గనైజర్ గా పనిచేస్తోంది. పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాట్లు చేయాలని అమీర్ అనే యువకుడు ఆ మహిళను సంప్రదించాడు. ఈ నెల 22వ తేదీ రాత్రి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. 

రాత్రి వేడుకలు ముగిసిన తర్వాత మద్యం సేవించిన అమీర్, అతని స్నేహితులు సుల్తాన్, సలీం, రాజ్ అలీ నగ్నంగా నాట్యం చేయాలని మహిళపై ఒత్తిడి చేశారు. ఆమె నిరాకరించడంతో కత్తితో బెదిరించి గదిలో బంధించారు. నాట్యం చేయాల్సిందేనని ఆమెపై దాడి చేశారు. 

రాత్రంతా గదిలోనే ఉన్న మహిళ 23వ తేదీ తెల్లవారు జామున వారి నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. ఆ తర్ాత తన భర్తతో కలిసి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.