Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాదులో వ్యభిచారం కొత్త పుంతలు: ఇంటికే అమ్మాయిలు

దంపతులు ముంబై నుంచి యువతులను రప్పించి హైదరాబాదులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఫోన్ చేస్తే ఇళ్లకే అమ్మాయిలను పంపించే ఏర్పాటు చేశారు. దాన్ని కనిపెట్టి పోలీసులు పట్టుకున్నారు.

Prostitution gang nabbed at Mylardevulapalli in Hyderabad
Author
Mylardevpally, First Published Jun 15, 2020, 6:19 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: లాక్ డౌన్ ను అసరా చేసుకుని ఓ ముఠా హైదరాబాదులో వ్యభిచారం నిర్వహిస్తోంది. ముంబై నుంచి హైదరాబాదుకు యువతులను రప్పించి వారితో వ్యభిచారం చేయిస్తోంది. హైదరాబాదులోని మైలారుదేవులపల్లిలో పోలీసులు ముఠాను అరెస్టు చేశారు. 

హైదరాబాదుకు చెందిన అబ్దుల్ మిస్కిన్ (30) దంపతులు సంపాదన కోసం నీచమైన పనికి ఒడిగట్టారు. షేక్ ముస్తాక్ (27) అనే ఆటో డ్రైవర్ తో కలిసి ముంబై నుంచి ఇద్దరు యువతులను రప్పించారు. వారితో హైదరాబాదు పాతబస్తీలో, రాజేంద్రనగర్ సర్కిల్ లో వ్యభిచారం చేయిస్తున్నారు. 

విటులు ఫోన్ చేస్తే షేక్ ముస్తాక్ ఆటోలో యువతులను వారింటికే తీసుకుని వెళ్తాడు. మూడు రోజుల క్రితం శాస్త్రిపురం డివిజన్ లోని కింగ్స్ కోలానీలో ఈ ముఠా మకాం ఏర్పాటు చేసుకుంంది. విటులు వస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

శనివారం అర్థరాత్రి దాడులు చేసి నిర్వాహకులతో పాటు హైదరాబాదుకు చెందిన ఇద్దరు యువకులను అరెస్టు చేసి, ఇద్దరు యువతులను సంరక్షణ గృహానికి తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios