హైదరాబాద్: ఓ పోలీసు కానిస్టేబుల్ వ్యభిచారం కేసులో ఇరుక్కున్నాడు. వ్యభిచారం కేసులో పోలీసు కానిస్టేబుల్ ను హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్ లోని కృష్ణానగర్ లో పోలీసు కానిస్టేబుల్ అత్యంత రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 

దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు లంగర్ హౌస్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ ను  కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిపై పిటా కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

సెలూన్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును హైదరాబాదు పోలీసులు ఇటీవల రట్టు చేశారు. కాలేజీ విద్యార్థులు, యువత టార్గెట్ గా కొత్త తరహాలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. ఈ సంఘటన హైదరాబాదులోని కెపిహెచ్ బీ కాలనీలో ఈ వ్యవహారం వెలుగు చూసింది. 

గ్లోవెల్ ఫ్యామిలీ స్పా అండద్ సెలూన్ పై దాడి చేసి నిర్వాహకుడు వెంపటి సతీష్ తో పాటు ఓ మహిళా ఉద్యోగిని కూడా పోలీసులు పట్టుకున్నారు మరో ముగ్గురు మహిళలు, ఆరుగురు విటులు పోలీసులకు చిక్కారు.