హైదరాబాద్: నగ్న చిత్రాలను పంపుతూ అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ల నుంచి యువతులు, విద్యార్థినుల ఫొటోలు సేకరించి మార్పింగ్ ద్వారా నగ్నచిత్రాలుగా మార్చి వాళ్లకు పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్న మహ్మద్ అహ్మద్ ను పోలీసులు అరెస్టు చేశారు. 

అమ్మాయిల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న అహ్మద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందినవాడు. అతన్ని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. యాభై మందికి పైగా యువతుల వివరానలు అతని మొబైల్ లో గుర్తించారు. హైదరాబాదుకు చెందిన యువతి ఫిర్యాదు చేయడంతో అతని గుట్టును పోలీసులు లాగారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహమ్మద్ అహ్మద్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. సోషల్ మీడియాలో ఖాతాలున్న యువతులు, విద్యార్థినుల ఫోన్ నెబర్లు, ఫొటోలను సెకరించేవాడు. వాటిని నగ్నంగా మార్చి వారి వాట్సప్ లకు పంపించేవాడు. డబ్బు కావాలని బెదిరిస్తూ వచ్చేవాడు. కొందరు అతనికి డబ్బులు సమర్పించుకున్నారు కూడా.