హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరోసారి వ్యభిచారం ముఠా గుట్టు రట్టయింది. వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు ేశారు. హైదరాబాదులోని సుల్తాన్ బజార్ లో గల ఓ లాడ్జీపై  పోలీసులు దాడి చేశారు. 

తమ దాడిలో పోలీసులు ఇద్దరు యువతులను, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ కు చెందిన రఫీక్ అనే వ్యక్తి కోఠిలోనీ పుత్లీబౌలీ చౌరస్తా వద్ద ఆదిలాబాద్ లాడ్జీ పేరుతో గత కొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సీఐ సుబ్బిరామిరెడ్డి తెలిపారు. 

తమకు అందిన సమాచారం మేరకు రాత్రి 9 గంటలకు సుల్తాన్ బజార్ ఎస్సై లింగారెడ్డి తమ సిబ్బందితో కలసి లాడ్జీపై దాడి చేసి ఇద్దరు యువతులను, ఇద్దరు విటులను అరెస్టు చేశారు. వారితో పాటు లాడ్జి సూపర్ వైజర్ ను కూడా అరెస్టు చేసారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.