హైదరాబాద్: తెలంగాణ రాజధానిలో మరో  సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. యువకులను మరీ ముఖ్యంగా కాలేజీ యువత, విద్యార్థులే టార్గెట్ గా కొత్త తరహాలో  వ్యభిచారాన్ని చేపడుతున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి భారీమొత్తంలో నగదుతో పాటు కండోమ్ పాకెట్లను స్వాదీనం చేసుకున్నారు పోలీసులు. 

ఈ వ్యవహారం కేపిహెచ్‌బి లోని  ఓ అపార్టుమెంట్ లో సెలూన్ పేరుతో గుట్టుగా సాగుతోంది. అయితే సెలూన్ ముసుగులో ఇక్కడ అబ్బాయిలను ఆకర్షించి సెక్స్ దందా నడిపిస్తున్న స్థానిక పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ సెలూన్ పై నిఘాపెట్టిన పోలీసులు అక్కడ నిజంగానే వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో గ్లోవెల్‌ ఫ్యామిలీ స్పా అండ్‌ సెలూన్‌ పై దాడిచేశారు పోలీసులు.

ఈ దాడిలో నిర్వహకుడు వెంపటి సతీష్ తో పాటు ఓ మహిళా ఉద్యోగి కూడా పట్టుబడ్డారు. అలాగే మరో ముగ్గురు మహిళలు, ఆరుగురు విటులు పోలీసులకు చిక్కారు. వీరివద్ద నుండి లక్ష రూపాయల నగదుతోపాటు సెల్ ఫోన్లు, ల్యాప్  టాప్ లు, కండోమ్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం  చేసుకున్నారు. 

ఈ తరహాలో హైటెక్ వ్యభిచారానికి పాల్పడుతూ యువతను తప్పుదారిలోకి లాగుతున్న అసాంఘిక శక్తులను వదిలిపెట్టబోమని స్థానిక సీఐ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. నిర్వహకులపై కఠినమైన కేసుులు పెడతామన్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.