హైదరాబాద్: హైదరాబాదులోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి నీచమైన పనికి ఒడిగట్టాడు. తన రెండో భార్య కూతురు న్యూడ్ ఫొటోలను తన ల్యాప్ టాప్ లో పెట్టుకున్నాడు. మొదటి భార్య చనిపోవడంతో అతను రెండో పెళ్లి చేసుకున్నాడు.

రెండో భార్యకు ఓ కూతురు ఉంది. ఆ కూతురు నగ్న చిత్రాలను తన ల్యాప్ టాప్ లో పెట్టుకున్నాడు. దానిపై తల్లి సాయంతో కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

అప్పుడు అతనికి కరోనా వైరస్ వ్యాధి సోకడంతో మందలించి వదిలేశారు. కరోనా తగ్గడంతో అతన్ని అరెస్టు చేశారు. అతనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కూతురికి తెలియకుండా ఆ ఫోటోలను అతను తన ల్యాప్ టాప్ లో దాచుకున్నాడు.