Asianet News TeluguAsianet News Telugu

వ్యభిచారం కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష

వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడిన కేసులో నిర్వహకురాలితో పాటు విటుడికి న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురం సహారా కాలనీకి చెందిన చెరుగురు కవిత సులభంగా డబ్బు సంపాదించడంతో పాటు విలాసవంతంగా గడిపేందుకు గాను వ్యభిచారాన్ని మార్గంగా ఎంచుకుంది

BROTHEL ORGANISER AND CUSTOMER GOT 3 YEARS  IMPRISONMENT CONVICTION IN HUMAN TRAFFICKING
Author
Hyderabad, First Published Oct 21, 2019, 8:06 PM IST

వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడిన కేసులో నిర్వహకురాలితో పాటు విటుడికి న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురం సహారా కాలనీకి చెందిన చెరుగురు కవిత సులభంగా డబ్బు సంపాదించడంతో పాటు విలాసవంతంగా గడిపేందుకు గాను వ్యభిచారాన్ని మార్గంగా ఎంచుకుంది.

ఈ క్రమంలో మీర్‌పేటకు చెందిన వెంకట రామ్ మోహన్.. కవితను కలిశాడు. వ్యభిచారం నిమిత్తం కవితకు డబ్బు ఇచ్చాడు. అయితే 2016 మే నెల 18న వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు కవిత ఇంటిపై దాడులు చేశారు.

ఈ సందర్భంగా కవితతో పాటు ఇద్దరు విటులను ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. దీనితో పాటు రూ.3,870 నగదు, 4 కండోమ్ ప్యాకెట్లు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

వ్యభిచార కూపం నుంచి బయటపడిన ఇద్దరు యువతులను ప్రజ్వాలా పునరావాస కేంద్రానికి తరలించారు. అక్కడ డాక్టర్ సునీతా కృష్ణన్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మానసిక వేధనను దూరం చేసి కోర్టు విచారణకు సిద్ధం చేశారు. నిందితులు ఇద్దరిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

Also Read: వ్యభిచారం చేయమన్నాడని.... ఒక ప్రియుడితో కలిసి మరో ప్రియుడిని...

సుధీర్ఘ విచారణ అనంతరం వీరిపై ఛార్జిషీటు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. సోమవారం ఎల్‌బీ నగర్‌లోని 11వ మెట్రోపాలిటిన్ కోర్టు వీరిద్దరిపై నమోదైన అభియోగాలను ధ్రువీకరించి ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించింది.

మానవ అక్రమ రవాణా ప్రస్తుతం ప్రపంచంలో నమోదవుతున్న నేరాల శాతంలో రెండో స్థానంలో నిలిచింది. దీనిపై ప్రతి ఏటా వేల కోట్లు చేతులు మారుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మరోవైపు రాచకొండ పోలీస్ కమీషనరేట్ ఇప్పటి వరకు వ్యభిచారం నేరం కింద వంద మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ఐటీపీ చట్టంతో పాటు సెక్షన్ 133 సీఆర్‌పీసీ ప్రకారం ఇంటిని అద్దెకు ఇచ్చేముందు యజమానులు వారి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయాల్సిందిగా పోలీసులు సూచించారు.

మసాజ్ పార్లర్‌లో కండోమ్‌లతో పాటు అమ్మాయిల పేరిట రేట్ కార్డులు లభించాయి. యువతుల అశ్లీల ఫోటోలతోపాటు వారి రేటు ఎంత అనేది పేర్కొంటూ రేట్ కార్డులు మసాజ్ పార్లర్‌లో లభించడం సంచలనం రేపింది. 

Also Read: మసాజ్ సెంటర్లో వ్యభిచారం... కుప్పలుగా కండోమ్స్, రేట్ కార్డ్స్

మసాజ్ సెంటర్ పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును మహిళా కమిషన్ రట్టు చేసింది.ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ నేతృత్వంలోని ఓ బృందం ఢిల్లీలోని బురారీ ప్రాంతంలోని మసాజ్ పార్లర్ పై ఆకస్మిక దాడులు చేసింది. 

ఈ దాడుల్లో మసాజ్ పార్లర్‌లో కండోమ్‌లతో పాటు అమ్మాయిల పేరిట రేట్ కార్డులు లభించాయి. యువతుల అశ్లీల ఫోటోలతోపాటు వారి రేటు ఎంత అనేది పేర్కొంటూ రేట్ కార్డులు మసాజ్ పార్లర్‌లో లభించడం సంచలనం రేపింది.

ఈ మసాజ్ పార్లర్ నుంచి గతంలోనూ నలుగురు అమ్మాయిలను మహిళా కమిషన్ కాపాడింది. పశ్చిమ ఢిల్లీలోని ద్వారక, ఇతర ప్రాంతాల్లోని మసాజ్ పార్లర్లు, స్పాలపై మహిళా కమిషన్ బృందం ఆకస్మిక దాడులు చేసింది. ఈ దాడుల్లో వ్యభిచారం రాకెట్ బాగోతం బయటపడింది. దీంతో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు

Follow Us:
Download App:
  • android
  • ios