రైతును బూతులు తిట్టిన టీఆర్ఎస్ నేత (ఆడియో)

First Published 2, Mar 2018, 5:36 PM IST
vikarabad trs leader scolded farmer
Highlights
  • వివాదంలో మరో టీఆర్ఎస్ నాయకుడు
  • రైతును బండబూతులు తిడుతూ అడ్డంగా దొరికిన వైనం

వికారాబాద్ జిల్లాలో మరో టీఆర్ఎస్ నాయకుడి బూతుపురాణం వెలుగులోకి వచ్చింది.  పరిగి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి తనయుడు మహేష్ రెడ్డి ఒక రైతును ఫోన్ లో బండబూతులు తిట్టిన ఆడియో వైరల్ అవుతోంది. మహేష్ రెడ్డి తాజాగా రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ నియమితులయ్యాయి. ఇలా రైతులపక్షాన నిలవాల్సిన వ్యక్తి రొంపల్లి పాండు అనే వ్యక్తిని తిడుతున్నట్లుగా వున్న వీడియో బైటకువచ్చింది. మహేష్ రెడ్డి తన ఫోన్ లో రికార్డయిన ఆడియోను మీడియాకు అందజేశాడు. దీంతో ఈ వివాదం ఇపుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

టీఆర్ఎస్ నాయకుడి బెదిరింపులను కింది వీడియోలో చూడండి  

loader