మహిళా అధికారిని బూతులు తిట్టిన కేటీఆర్ చుట్టం (వీడియో)

First Published 14, Mar 2018, 7:23 PM IST
ktr relative attacks on lady officer
Highlights
  • మహిళా అధికారిపై దాడిచేసిన కేటీఆర్ చుట్టం
  • శిఖం భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేస్తుండగా అడ్డుకున్న సిబ్బంది

కేటీఆర్ బందువునని చెప్పుకుంటూ ఓ వ్యక్తి విధుల్లో వున్న మహిళా అధికారిని బూతులు తిడుతూ దౌర్జన్యానికి దిగాడు. దూలపల్లి గ్రామంలో శిఖం భూమిని ఆక్రమించుకుని అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. అయితే ఈ విషయం తెలిసి ఈ ఆక్రమణలను అడ్డుకోడానికి వెళ్లిన మండల ఆర్ఐ రేణుకను కేటీఆర్ బంధువు రంగినేని రంగారావు దూషించారు. తాను తలుచుకుంటే సీఎం కేసిఆర్ కు చెప్పి ఒక్కరోజులో సస్పెండ్ చేపిస్తనని బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇంతటితో ఆగకుండా ఇక్కడ పనులు చేపడుతున్న  జేసీబీ డ్రైవర్‌ ను రంగారావు చితకబాదాడు.  

వీడియో

 

 

loader